పిల్లాడు ఒళ్లు చేసాడు

పెళ్లయిన తరువాత కాస్త ఒళ్లు రావడం అన్నది కామన్ అంటారు. అయితే సినిమా జనాలు మాత్రం కాస్త జాగ్రత్త గా వుంటారు. అయితే చేతిలో సినిమాలు లేకపోతే ఇంకేం జాగ్రత్త. బహుశా అందుకే కావచ్చు. సన్నగా, బక్క పల్చగా వుండే వరుణ్ సందేశ్ కాస్త ఒళ్లు చేసాడు. ఎప్పుడో తీసి పక్కన పెట్టిందో, లేక ఇప్పుడే తీసారో కానీ, మర్ల పులి అనే హర్రర్ ప్లస్ సి గ్రేడ్ రొమాంటిక్ సినిమా ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రయిలర్ లో వరుణ్ కాస్త ఒళ్లు చేసి, పొంగినట్లున్న మొహంతో కనిపించాడు.

అసలు టాలీవుడ్ నుంచి పక్కకు వెళ్లిపోయాడు అనుకుని, అందరూ మరిచిపోయిన టైమ్ లో ఈ ట్రయిలర్ తో తాను ఉన్నానంటూ గుర్తు చేసాడు. తాగుబోతు రమేష్, పోసాని, వేద లాంటి వాళ్లతో కలిసి వరుణ్ కనిపించిన ఈ ట్రయిలర్ లో అతగాడు ఒళ్లు చేసిన వైనం మినహా మరేమీ పెద్దగా విశేషం లేదు.

Show comments