తెలుగు గోల ముగిసింది, రాజధానిని తగులుకోండి

తెలుగు మీడియం ముద్దు, ఇంగ్లిష్ మీడియం వద్దు అంటూ.. చేస్తున్న పోరాటంనుంచి టీడీపీ పక్కకు తప్పుకుంది. మేం ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం కాదంటూ చంద్రబాబు స్టేట్ మెంట్ ఇవ్వడంతో.. టీడీపీ నేతలెవరూ ఆ సబ్జెక్ట్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో అర్జంట్ గా పచ్చబ్యాచ్ కి ఓ సబ్జెక్ కావాల్సిన టైమ్ వచ్చింది. కొత్తది ఏదీ దొరక్కపోవడంతో మళ్లీ రాజధానినే తగులుకున్నారు. 

చినబాబు లోకేష్ ముందుగా దీన్ని తెరపైకి తెస్తూ రెచ్చిపోయి మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీ మంత్రి కోటేశ్వరరావు వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజధాని గురించి మాట్లాడారు. ఏపీ రాజధాని లేని రాజ్యంలా మారిపోయిందంటూ తెగ ఆందోళన పడ్డారు. రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల్ని వైసీపీ నట్టేట ముంచిందని విమర్శించారు లోకేష్. 

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాటమారుస్తున్నారని విమర్శించారు లోకేష్. అసలు జగన్ ఎప్పుడూ రాజధానిని మారుస్తున్నట్టు ప్రకటించలేదు, కనీసం రాజధానిపై అనుమానం వచ్చేలా కూడా ఎక్కడా కామెంట్ చేయలేదు. మరి లోకేష్ కి ఇప్పుడెందుకు ఆ అనుమానం వచ్చిందో తెలియదు. రాజధానిపై వైసీపీ స్పష్టమైన ప్రకటన కూడా చేయాలని డిమాండ్ చేశారు చినబాబు. 

ఇంతకీ రాజధానిపై జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వాలో కూడా లోకేష్ చెబితే బాగుంటుంది. ఇప్పటికే రాజధాని పేరుతో భూదందా చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు టీడీపీ నేతలు. రాజధాని పేరుతో రైతుల్ని నిండా ముంచింది టీడీపీయే, ఆ తప్పులు ఎక్కడ బైటపడతాయోనని ఇప్పుడు రైతుల పేరు చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు లోకేష్.

రాజధానిగురించి కలవరించే చినబాబు ఐదేళ్లలో ఎక్కడ నిద్రపోతున్నారు. తాత్కాలిక భవనాలు, అది కూడా వర్షానికి ఉరిసే అత్యంత నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి ప్రజల్ని దారుణంగా మోసం చేసింది టీడీపీ. అసలు రాజధాని గురించి మాట్లాడే అర్హత లోకేష్ కి ఉందో లేదో వారే చెప్పాలి. 

పోనీ రాజధానిపై జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తే.. ఈరోజుకీరోజు రాష్ట్ర పాలనలో ఏమైనా మార్పు వస్తుందా. పాలన గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ కృషిచేస్తుంటే, మరోవైపు రాజధాని అంటూ టీడీపీ రగడ చేయడాన్ని ఎలా చూడాలి. వివాదం చేయడానికి ఏ సబ్జెక్ట్ దొరక్కపోవడంతో.. లోకేష్ ఇప్పుడు రాజధానిని నెత్తికెత్తుకున్నారు. 

Show comments