సైరా ప్రచారానికి మెగా ప్లాన్ ఇదే

మెగాస్టార్ మెగా మూవీ సైరా విడుదల తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. ఇక ఎనిమిది రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సూత్రధారి, పాత్రధారి మెగాస్టార్ చిరంజీవి నేరుగా ప్రచారానికి దిగలేదు. నిన్నటికి నిన్న జరిగిన మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంతకు ముందు టీజర్ విడుదల సమయంలో ముంబాయిలో మీడియాతో మట్లాడారు.

ఇప్పుడు నేరుగా ప్రచారంలోకి దిగబోతున్నారు. ఈనెల 24,25,26 తేదీల్లో ఆయన తెలుగు వెర్షన్ పబ్లిసిటీ కార్యక్రమాలను చూస్తారని తెలుస్తోంది. టీమ్ ఇంటర్వూలు, మీడియా మీట్ లు, స్మాల్ చిట్ చాట్ లు అన్నీ బహుశా ఈ మూడు రోజుల్లోనే వుండే అవకాశం వుంది.

27,28,29 తేదీల్లో ఆయన చెన్నయ్, బంగళూరు, కోచ్చి, ముంబాయ్ వెళ్లే అవకాశం వుంది. ఆయా పట్టణాల్లో, ఆయా భాషల సైరా వెర్షన్ ల ప్రమోషన్ నిర్వహిస్తారు. 30న తిరిగి వస్తారు. అవకాశం వుంటే మరోసారి 30, 1వ తేదీల్లో తెలుగు వెర్షన్ ప్రమోషన్ పనులు చేస్తారు. 2న సైరా విడుదల.

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments