సుక్కూ..మళ్లీ రివెంజ్ స్టోరీనే

తెలుగు సినిమాకు రివెంజ్ ఫార్ములా అన్నది కీలకం. మహా మహా సినిమాలకు రివెంజ్ ఫార్ములానే సక్సెస్ సూత్రం. డైరక్టర్ సుకుమార్ కూడా దీనినే నమ్ముకున్నారు. వన్ నేనొక్కడినే , నాన్నకు ప్రేమతో రెండు సినిమాలు రివెంజ్ ఫార్ములానే. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా రివెంజ్ ఫార్ములా నే అని వినిపిస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథలో బన్నీ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథలో బన్నీ చాలా రఫ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఖైదీ సినిమాలో కార్తీ ఎలా వున్నాడో దాదాపు అలా కనిపించబోతున్నాడట బన్నీ. ఎర్రచందనం దుంగులు లారీలో స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ లో బన్నీ కనిపించినా, దాని వెనుక కూడా రివెంజ్ ఫార్ములానే వుంటుందని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాకు 'రెడ్' అని పేరు పెట్టాలనుకున్నారు సుకుమార్ అని తెలుస్తోంది.అయితే ఆ టైటిల్ ను హీరో రామ్ తన సినిమాకు పెట్టేసుకున్నారు. అందుకే ఇప్పుడు వేరే టైటిల్ వెదుకుతున్నట్లు బోగట్టా. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Show comments