బాహుబలి తర్వాత.. ప్రభాస్ పారితోషకమెంతంటే…!

వసూళ్ల విషయం నభూతో.. అనిపిస్తున్న బాహుబలి- పార్ట్ టూ సినిమా యూనిట్ తదుపరి సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తదుపరి రాజమౌళి ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు? ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతోంది? అమితాసక్తిని రేకెత్తించే ప్రశ్నలివి. ఆ సినిమాలపై సూపర్ హైప్ ఉంటుంది కూడా.

మరి ఆ హైప్ ను క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాహుబలి యూనిట్ వెనుకాడదు కూడా. ఇప్పుడు అదే జరుగుతోంది. బాహుబలి హీరోగా బాలీవుడ్ సహా వివిధ భాషల వాళ్లకు గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ అయిన ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో ఆసక్తికరమైన నంబర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ రెమ్యూనరేషన్ కొత్త హైట్స్ కు చేరిందనే మాట వినిపిస్తోంది.

ఇప్పుడు అది ముప్పై కోట్ల రూపాయలకు రీచ్ అయ్యిందని సమాచారం. వాస్తవంగా చెప్పాలంటే బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ పారితోషకానికి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు.  ఇంత భారీ సినిమాలో నటించడానికి పారితోషకం ఎందుకన్నట్టుగానే వ్యవహరించాడని అంటారు. పారితోషకం లెక్కలతో నిమిత్తం లేకుండా బాహుబలిని పూర్తి చేసిన ఈ హీరో తదుపరి సినిమాలకు మాత్రం కనీసం ముప్పై కోట్ల రూపాయల వరకూ చార్జ్ చేస్తున్నాడని టాక్. ఎలాగూ ప్రభాస్ సినిమాలను ఇకపై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసుకోవచ్చు కదా.. కాబట్టి.. ముప్పై కోట్ల రెమ్యూనరేషన్ హేతుబద్దమైనదేనేమో!

Show comments