సిల్లీ ఫెలోస్ లో తిండిపాట

ఏ హీరో లెవెల్ ఆ హీరోది. పైగా పాత్రను బట్టి కూడా వుంటుంది వ్యవహారం. హీరో కవి అయితే, హీరోయిన్ అంగాంగం ఇలా వుంది అలా వుంది అంటూ కవితాత్మకంగా వర్ణిస్తాడు. కానీ హీరో అల్లరి నరేష్ అయితే, అతగాడికి కాస్త తిండి పిచ్చి వుంటే ఏం చేస్తాడు. హీరోయిన్ ను నీ బుగ్గలు బూరెల్లా వున్నాయి, మెడ వడలా వుంది, నడుం జాంగిరీలా వుంది అనేలా వర్ణిస్తాడు.

బహుశా ఇది దృష్టిలో పెట్టుకునే కావచ్చు, సిల్లీ ఫెలోస్ లో ఓ తిండి డ్యూయట్ తయారు చేయించారు. ఈ పాటను అల్లరి నరేష్ మీద హీరోయిన్ మీద చిత్రీకరించారు. ఈ పాట ఇలా సాగుతుంది. పిల్లా నీ బుగ్గలు బూరెల్లా ఊరిస్తున్నాయి, నా దిల్ పూరీలా పొంగింది, నీ నడుం గుండ్రంగా చపాతీలా తిరగేస్తోంది, నా ఊపిరి ఉప్మాలా ఉడుకుతోంది, మీ చూపులు మినప వడలా, మన లైఫ్ లాంగ్ సాంబార్ ఇండ్లీ అంటూ రాసుకోచ్చారు కవి చిలకరెక్క గణేష్.

అక్కడితో ఆగలేదు, మిరియాలు, మిర్చి, చిల్లి గారెలు, కాఫీ, ఆలూ పరోటా, దద్దోజనం లాంటి పదాలు జోడించాడు. పుల్కాపై శుభలేఖ, పేపర్ దోశ ఫ్లెక్సీ, పులిహోర అక్షింతలు, పుణుగుల దండ అంటూ పెళ్లి వ్యవహారాలకు ఫుడ్ కి లింక్ పెట్టేసాడు.

మొత్తానికి సిల్లీ ఫెలోస్ కోసం ఓ సిల్లీ సాంగ్ రాయించేసారు అన్నమాట.

Show comments