ఏజెంట్ బ్యూటీకి మరో ఆఫర్

ఒక్కోసారి సినిమా హిట్ అయినప్పటికీ హీరోయిన్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపురాదు. హిట్ తర్వాత అవకాశాలు క్యూ కట్టవు. అరవిందసమేత హిట్ అయినా ఈషారెబ్బాకు అవకాశాలు రాలేదు. టాక్సీవాలా సింగిల్ డేకే బ్రేక్-ఈవెన్ అయినా ప్రియాంక జవాల్కర్ క్లిక్ అవ్వలేదు. ఇదే కోవలో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ హీరోయిన్ కూడా మొన్నటివరకు ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు ఆమెకు బ్రేక్ వచ్చింది.

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ తర్వాత రెండో సినిమా అవకాశం అందుకుంది శృతి శర్మ. నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో రాబోతున్న కార్తికేయ-2 సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇది థ్రిల్లర్ సబ్జెక్ట్ అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో ఏజెంట్ ఆత్రేయకు అసిస్టెంట్ గా స్నేహ పాత్రలో కనిపించింది శృతి శర్మ. సినిమాలో చాలా చోట్ల కామెడీ ఈ పాత్ర ద్వారానే పండుతుంది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న శృతి శర్మ.. కార్తికేయ-2 మూవీలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోంది.

మొత్తానికి ఓ హిట్ తర్వాత ఇప్పుడిప్పుడే మెల్లగా ఓ అవకాశం పట్టేసింది శృతి శర్మ. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు కూడా ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. ఇదే బాటలో ఎవరు హీరోయిన్ రెజీనాకు కూడా తెలుగులో ఓ ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఎవరు హిట్ అయినప్పటికీ, ఆమె కూడా ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. 

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?