చైతూ, సమంత.. రూమర్లకు మరింత ఊపు!

సమంతతో తన ప్రేమాయణం విషయంలో జరుగుతున్న ప్రచారం పై ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు నాగచైతన్య. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం దాదాపు ఏడాది నుంచి గట్టిగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అది పీక్స్ కు వెళ్లింది! వీరి ప్రేమ పెళ్లికి దగ్గరవుతోందనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పై స్పందిస్తూ సమంత ఊరడింపుగా మాట్లాడుతోంది.. ఆ ప్రచారానికి పెట్రోల్ పోస్తోంది. చైతూ మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు!

ఎలాగూ నాగార్జున కూడా హీరోయిన్ అయిన అమలను వివాహం చేసుకున్నాడు కాబట్టి.. ఆయన తనయుడు తన తరం హీరోయిన్ ను చేసుకొవచ్చు అనే లాజిక్ కూడా ఈ రూమర్లకు మరింత ఊపును ఇచ్చింది. మరి ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరో డెవలప్ మెంట్ చైతన్య కూడా సమంతతో ప్రేమాయణ ప్రచారం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నట్టవుతోంది.

రికార్డు స్థాయిలో సమంతతో నాలుగో సారి జత కట్టనున్నాడట చైతన్య. ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య సినిమాల్లో ఈ జంట కనిపించింది. తాజాగా చైతూ హీరోగా కల్యాణకృష్ణ కురసాల దర్వకత్వం లో రానున్న సినిమాలోకూడా సమంతనే హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

మరి ఒకవైపు తన తో ఒక రూమర్ విషయంలో ప్రచారంలో ఉన్న హీరోయిన్ తో మరో సినిమాను చేయడానికి చైతూ రెడీ అవుతున్నాడంటే.. ఆ రూమర్లకు మరింత ఊపునిచ్చినట్టే అవుతుంది.  మరి మరోసారి కలిసి పనిచేయడం ద్వారా తమ ప్రేమలో కొత్త చాప్టర్ కు వీరు తెరతీసినట్టే కాబోలు! 

Show comments