బీడీ కాల్చనున్న బాలయ్య

చాన్నాళ్లయింది స్క్రీన్ మీద బాలయ్య బీడీ కాల్చడం చూసి. త్వరలో ఆ ముచ్చట తీరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో నందమూరి బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పూరి హీరో క్యారెక్టర్ లు ఎలా వుంటాయో కూడా తెలిసిందే. బాలయ్య కూడా ఇలా రఫ్ అండ్ టఫ్, ఏరోగెంట్ క్యారెక్టరే చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్యారెక్టర్ కు బీడీకాల్చే అలవాటును జోడిద్దామని పూరి సూచన చేసారని, బాలయ్య ఓకె అన్నారని గాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఎప్పుడో ఎస్వీ కృష్ణారెడ్డి టాప్ హీరో సినిమాలో బాలయ్య బీడీ కాల్చినట్లు గుర్తు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన అలా కన్పించబోతున్నారన్నమాట. ఇదిలా వుంటే పూరి స్టయిల్ క్యారెక్టరైజేషన్ అయినా కూడా అది బాలకృష్ణ స్టయిల్ లోనే వుంటుంది అని, రెండు కలిసి మిక్స్ చేసి ఫిక్స్ చేస్తారని టాక్. పూరి సినిమాల్లో హీరోలు బీడీకాల్చడం అన్నది చాలా కామన్. మొన్నటికి మొన్న అబ్బాయ్ కళ్యాణ్ రామ్ చేత బీడీ కాల్పించాడు. ఇఫ్పుడు బాబాయ్ చేత కూడా కాల్పిస్తాడన్న మాట.

Show comments