'రొమాంటిక్' రమ్యకృష్ణ

బాహుబలి సినిమా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. ఇప్పుడు ప్రత్యేకమైన పాత్రలు ఆమె కోసం వెదుక్కుంటూ వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా, శైలజరెడ్డి అల్లుడులో వైవిధ్యమైన పాత్రలో చేసిన రమ్యకృష్ణ ఇప్పటికే బంగార్రాజు సినిమాలో మళ్లీ కనిపించబోతున్నారు.

లేటెస్ట్ గా మరో సినిమాలో ఓ పాత్రకు రమ్య ఓకె చెప్పారు. పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ తో నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ ఓ ఫుల్ లెంగ్త్ స్పెషల్ రోల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కథ మాటలు మాత్రమే పూరి జగన్నాధ్ అందిస్తున్నారు. దర్శకత్వం మాత్రం అనిల్ అనే కొత్త దర్శకుడికి అప్పగించారు. ఎప్పటిలాగే తన స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

కేతిక శర్మ అనే అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ, ఇప్పటికే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు సంబంధించి పూరి బయటకు వదిలిన స్టిల్స్ అలా వున్నాయి మరి. ఈ సినిమాను ప్రీ సమ్మర్ విడుదల దిశగా రెడీ చేస్తున్నారు.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!