జ్యోతి, ఈనాడులతో ఆ విషయంలోనూ వేరైన సాక్షి!

వార్తల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలది ఒకరూటు... సాక్షిది మరోరూటు అని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు పత్రికలూ వార్తల్లో దాచేస్తున్న కోణాన్ని చూపడానికే సాక్షి అని.. దాదాపు పదేళ్ల కిందటే నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అందుకు తగ్గట్టుగా.. ఆ రెండు పత్రికల వార్తలకు కౌంటర్ అటాక్ గా సాక్షి ప్రస్థానం సాగుతూ వస్తోంది.

ఈ వైరం ఒకదశలో తీవ్ర స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ మధ్య కొంచెం బెటర్. ఇక గత కొన్నేళ్ల ప్రస్థానంలో ఈ వైరి మీడియా వర్గాల మధ్యన ఏదైనా కామన్ పాయింట్ ఉండిందంటే అది ధర మాత్రమే. వేర్వేరు వాణీలు వినిపించే తెలుగు పత్రికలు తమ ప్రింట్ ను అమ్ముకునే రేటు విషయంలో మాత్రం ఒకే తీరున సాగాయి ఇన్నేళ్లూ.

మూడు రూపాయల ధర నుంచి రేటు పెంచినప్పడల్లా.. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి.. కామన్ గా ధరను పెంచాయి. డేట్ కూడా తేడా రాకుండా.. మూడు పత్రికలూ ఒకేరోజున ధర పెంపును అమలు పరుస్తూ వచ్చాయి. ఈ విషయంలో వీళ్ల మధ్య మామూలు యూనిటీ కాదు.. పాఠకులే ఆశ్చర్యపోయే యూనిటీ కనిపించింది.

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వద్ద ఈ మూడు పత్రికల యాజమాన్యాలు కూడ బలుక్కుని, ఒకరు పెంచి మరొకరు ధర పెంచకపోతే.. సర్క్యులేషన్లో తేడాలు వచ్చేస్తాయి కాబట్టి.. అంతా కామన్ గా రేటు పెంచుతూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఈ విషయంలో కూడా జగన్ పత్రిక రూటు మార్చింది.

ఆంధ్రజ్యోతి, ఈనాడులు రోజువారీగా రేటును పెంచేశాయి. రోజూ వారీగా 6.50 పైసలు, ఆదివారం రోజున ఏకంగా 8 రూపాయల ధరకు చేరిపోయాయి ఆ పత్రికలు. లెక్క ప్రకారం అయితే సాక్షి రేటు కూడా ఈ మేరకు పెరగాలి.

ఇన్ని రోజులూ కామన్ గా రేటు పెంచుతూ వచ్చారు కాబట్టి. అయితే ఈసారి సాక్షి రేటు పెరగలేదు. పాతధరకే వస్తోంది. ఈనాడు, జ్యోతిలతో పోలిస్తే తమ పత్రిక ప్రాధాన్యతలు మరింత స్పష్టం అని.. సాక్షి వాళ్లు రేటు పెంచలేదని అనుకోవాలి.

అయితే విశేషం ఏమిటంటే.. ఈనాడు, జ్యోతిల రేట్ పెరిగిన నేపథ్యంలో.. వాటి ఏజెంట్ల కమిషన్ కూడా పెరుగుతుంది. మరి సాక్షి ఏజెంట్ల పరిస్థితి ఏమిటి? అంటే.. రేటు పెంచిన పత్రికల ఏజెంట్లు ఎంత కమిషన్ పొందుతారో.. అంతే కమిషన్ ను తన ఏజెంట్లకూ సాక్షి చెల్లిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments