ప్రభాస్ కు బర్త్ డే గిఫ్ట్ అదేనా?

బాహుబలి సినిమా కొసం మూడేళ్లకు పైగా లాక్ అయిపోయి వున్నాడు ప్రభాస్. పార్ట్ 2 సినిమా చకచకా పూర్తవుతోంది. వచ్చే సమ్మర్ కు రెడీ అవుతోంది. అయితే బాహుబలి 2 పై ముందస్తు హైప్ పెంచేందుకు వీలుగా ట్రయిలర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట దర్శకుడు రాజమౌళి. 

పార్ట్ వన్ తీసినపుడు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాల బర్త్ డే ల సందర్భంగా స్పెషల్ టీజర్ల లాంటివి విడుదల చేస్తూ వచ్చారు. ఆ విధంగా పార్ట్ వన్ కు హైప్ పెంచారు. ఇప్పుడు పార్ట్ 2 కు కూడా ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 23న ట్రయిలర్ లాంటిదో, టీజర్ లాంటిదో ఒకటి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అంటే అక్టోబర్ 23 నుంచి ఇక బాహుబలి 2 ఫీవర్ మరింత ఊపందుకుంటుందన్నమాట. బాహుబలి సేల్స్ ఇప్పటికే స్టార్ట్ అయింది. భయంకరమైన రేట్లకు అమ్మేస్తున్నారు. మరి ఈ ట్రయిలర్ బయటకు వస్తే, ఇప్పటి దాకా అమ్మని ఏరియాలకు డిమాండ్, అమ్మేసిన ఏరియాలకు మారు బేరాలు తప్పవేమో? 

Show comments