కాటమరాయుడు సీన్ లీక్

పెద్ద సినిమాకు చిన్న పిక్ లీక్ అయినా హడావుడి ఓ రేంజ్ లో వుంటుంది. కాటమరాయుడు సినిమాకు సంబంధించి చిన్న క్లయిమాక్స్ వీడియో లీకైందన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. క్లయిమాక్స్ ఫైటింగ్ సీన్ ను ఎవరో ఔత్సాహికులో, అభిమానం ఎక్కువైపోయిన వాళ్లో నెట్ లోకి వదిలేసారట. దాంతో ఈ వీడియోలోని పిక్చర్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ ప్రారంభమైంది. జీన్ ఫ్యాంట్ వేసుకున్న పవన్ ను తలపై విలన్ బలంగా కర్రతో కొట్టే ఫొటో సోషల్ నెట్ వర్క్ లోకి వచ్చింది.

ఇదిలా వుంటే ఈ వీడియో ఎలా వచ్చిందీ? ముందు వెనుక పనుల గురించి యూనిట్ వెంటనే చర్య తీసుకునేపనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైబర్ క్రయిమ్ కు ఫిర్యాదు కూడా చేస్తారని వార్తలు వినవస్తున్నాయి. కాటమరాయుడు సినిమా మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కథ, సినిమా అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరుడొక్కడే అనే డబ్బింగ్ సినిమాగా జనం ముందుకు వచ్చింది.

Show comments