కమ్మోళ్లు.. ఆలోచించండి.. బాబు పరువు తీస్తున్నాడు!

ఏపీలో కమ్మ వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, చంద్రబాబు నాయుడు తీరుతో కమ్మ వాళ్లను మిగతా వాళ్లంతా అంటరాని వారుగా చూస్తున్నారని.. ఆవేదన వ్యక్తంచేశాడు దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి. తను కమ్మ వాడిని అని, అది తన ఐడెంటిటీ అని మరోసారి చెప్పిన పోసాని.. చంద్రబాబు నాయుడు తమ కులస్తుడే అయినా, తమ వాళ్ల పరువును బాబు తీస్తున్నాడని పోసాని వాపోయాడు.

బాబు చీప్ ట్రిక్స్ తో బాబు వ్యవహారశైలితో తమ కులానికి చెడ్డ పేరు వస్తోందని అన్నాడు. అందుకే కమ్మవాళ్లు ఆలోచించుకోవాలని.. చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాం.. కమ్మవాడు కాబట్టి.. అనే తీరును మార్చుకోవాలని పోసాని కోరాడు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి కుయక్తులు ఓడిపోయాయని, ఏపీలో కూడా అదే జరగాలని తను కోరుకుంటున్నానని పోసాని అన్నాడు.

'కేసీఆర్ నా కులపోడు కాదు, నాకు తెలిసిన వాడు కాదు, నేనెప్పుడూ ఆయన్ను డైరెక్టుగా కూడా చూడలేదు.. అయినా కేసీఆర్ గెలవాలని మొక్కుకున్నా.. అది జరిగింది. అందుకే అమ్మ వారికి పట్టుచీర పెట్టా, వెంకటేశ్వరస్వామికి పట్టుబట్టలు పెట్టా, సాయిబాబాకు శాలువా మొక్కు చెల్లించా.. '' అని వివరించాడు పోసాని కృష్ణమురళి.

తెలంగాణ ఫలితాలు వెల్లడయ్యే ముందు తను కూడా కొంత ఒత్తిడికి లోనయ్యానని పోసాని చెప్పాడు. ఆ ఆందోళనకు కారణం చంద్రబాబు నాయుడే అని అన్నాడు. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్దహస్తుడు అయిన చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి నోట్ల కట్టలతో దిగాడు అని.. దీంతో కేసీఆర్ ను ఓడిస్తారేమో అని భయపడ్డాను అని పోసాని అన్నాడు.

లగడపాటి సైంధవుడు టూ లా వ్యవహరించాడని అన్నాడు. వీళ్ల గేమ్స్ తో కేసీఆర్ ఓడతాడేమో అని తను భయపడ్డాను అని అందుకే దేవున్ని మొక్కుకున్నాను అని, కేసీఆర్ ను గెలిపించాలని కోరుకున్నాని, అది జరగడంతో మొక్కు చెల్లించానని పోసాని వివరించాడు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తన ఆశ అని అది నెరవేరుతుందని పోసాని అన్నాడు.

Show comments