జనసేన.. లీకుల రాజకీయం!

‘మనల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో.. జనసేన ప్రభావం ఎక్కువ సీట్లలో ఉండదు అన్నారో.. వారే ఇప్పుడు మనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు.. ఇదే మన బలం పెరిగింది అనేందుకు రుజువు..” అంటున్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. పవన్ లాజిక్ బాగానే ఉంది కానీ.. తన పార్టీ బలం పెరిగింది, తన పార్టీకి బలం ఉంది అని చెప్పుకోవడానికి ఇంతకు మించి లాజిక్ లు ఏమీలేవా? అనే సందేహం ఇక్కడ రావొచ్చు.

ఒక పార్టీ బలపడింది అంటే.. సామాన్యుల చూపు ఆ పార్టీ మీదపడాలి. రాజకీయ నేతలకూ ఆ విషయం అవగాహన రావాలి. ఆ పార్టీ వైపు వెళ్లాలి అనే భావన రావాలి. అది ప్రజలకు కూడా అర్థంకావాలి. ఇదంతా బహిరంగంగా జరిగే వ్యవహారం. అదొక హవా! అదొక ఊపు!

అలాంటి దాన్ని చూపించాల్సిన పవన్ కల్యాణ్.. ఏదో పార్టీ తమను పొత్తు కోసం సంప్రదించిందని దానికి తెలంగాణ రాష్ట్ర సమితి మధ్యవర్తిత్వం వహిస్తోందని చెప్పుకున్నాడు. పవన్ ఈ విషయంలో లీకు రాజకీయాన్ని నమ్ముకున్నట్టుగా ఉన్నాడు.

ఏదైనా ఆస్తిని అమ్ముకోవడానికి.. వేరేవాళ్లు ఆ రేటుకు అడిగారు, ఇంకొకరు ఈ రేటుకు అడిగారు అని లీకులు ఇస్తూ ఉంటారు వ్యాపారులు. అయితే ఎవరు అడిగారనే విషయాన్ని చెప్పరు. ఇప్పుడు పవన్ తీరు కూడా అలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా పొత్తు ప్రయత్నాలు చేయిస్తున్నారు.. అని పవన్ చెబుతున్నాడు.

తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు తెలుగుదేశం పార్టీ తరఫున అయితే పవన్ దగ్గర పొత్తు ప్రతిపాదన చేయరు. టీడీపీకి తెరాసకు సంబంధాలు చెడాయి ప్రస్తుతానికి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇన్ డైరెక్టుగా వైసీపీ అని చెప్పదలుచుకున్నాడని స్పష్టం అవుతోంది. వారు తమను తక్కవ అంచనా వేశారని, ఇప్పుడు పొత్తు  అడుగుతున్నారని పవన్ చెబుతున్నట్టుగా ఉన్నాడు.

బహుశా.. ఇలా చెప్పుకుని.. తన పార్టీ బలపడింది అని చెప్పుకోవాలని అనుకుంటే.. పవన్ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాము సొంతంగా పోటీచేస్తాము.. అని వైసీపీ అధినేత తాజాగా కూడా చెప్పాడు. ఎర్ర పార్టీలతో తప్ప ఎవరితోనూ పొత్తులు ఉండవని పవన్ కూడా చెప్పాడు.

పవన్ తో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ పవన్ పొత్తుల మాట మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో పొత్తు విషయంలో సీట్ల నంబర్ ను పెంచుకునేందుకు తెరాస పేరును పవన్ వాడుకుంటున్నట్టుగా ఉన్నాడు.

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

Show comments