మొన్న నాగ్, ఈసారి వెంకీ.. సీనియర్లే టార్గెట్!

కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఏ హీరోయిన్ అయినా కుర్రహీరోల సరసన మెరవాలని అనుకుంటుంది. పొరపాటున ఓ హిట్ వచ్చిందంటే, ఇక స్టార్ హీరోలందర్నీ కవర్ చేసేయాలని అనుకుంటుంది. కానీ పాయల్ రాజ్ పుత్ వ్యవహారం మాత్రం దీనికి రివర్స్ లో ఉంది. ఆర్ఎక్స్100 సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. వెంకీ సరసన నటించేందుకు ఓకే చెప్పింది.

అవును.. వచ్చేవారం నుంచి సెట్స్ పైకి రాబోతున్న వెంకీ మామ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. నిజానికి ఈ పాత్ర కోసం శ్రియను అనుకున్నారు. సీనియర్లకు ఎలాగూ ఆమె ఆప్షన్ కాబట్టి అంతా ఓకే అనుకున్నారు. కానీ సడెన్ గా పాయల్ లాంటి యంగ్ హీరోయిన్ తెరపైకి వచ్చేసరికి అంతా ఆశ్చర్యపోయారు.

కేవలం వెంకీ మాత్రమేకాదు, అతడి కంటే ముందు నాగార్జునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాయల్. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న మన్మధుడు-2 సినిమాలో నాగ్ సరసన నటించబోతోంది. ఇలా సీనియర్ హీరోల సినిమాలకు ఓకే చెబుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది పాయల్.

నిజానికి ఇక్కడో చిన్న లాజిక్ కూడా ఉంది. పాయల్ ఊహించినట్టు ఆర్ఎక్స్100 తర్వాత కుర్రహీరోల సరసన ఆమెకు అవకాశాలు క్యూ కట్టలేదు. చాన్నాళ్లు వెయిట్ చేసి ఓ ఐటెంసాంగ్ కు కూడా ఓకే చెప్పేసింది పాయల్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సీనియర్ల సరసన కూడా నటించడానికి సై అంటోంది.

మొత్తానికి  మన 50 ప్లస్ హీరోలకు ఈ సెగ్మెంట్ లో పాయల్ రూపంలో హీరోయిన్ దొరికింది. మొన్నటివరకు శ్రియ, తమన్న, అంజలి, నయనతార లాంటి వాళ్లు మాత్రమే వీళ్లకు దిక్కు. ఇప్పుడు పాయల్ కూడా అందుబాటులోకి వచ్చిందన్నమాట. 

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!