పవన్ పోటీకే ఇంత హంగామానా?

పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్. నిలువెత్తు ప్రజాభిమానానికి నిదర్శనం. ఆయన ఎక్కడ పోటీచేసినా, కళ్లు మూసుకుని గెలిచేసే పరిస్థితి. ప్రచారమే అవసరం లేదు. ఆయన అక్కడ అడుగు పెట్టాల్సిన పరిస్థితే లేదు. జనం వెల్లువలా ఓటేస్తారు. ఇదీ అభిమానుల మనసులో మాట. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు అంటే అర్థం ఏమిటి? ఆయనకు జనాల్లో ఆ చరిష్మా వుంది అనే కదా? మరి కానీ వాస్తవం ఏమిటి? ఇంత చేదుగా వుంది? ఆయన పోటీ చేయడానికి ఇంత కిందామీదా పడాలా? ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తాం? అని సర్వేలు చేయించాలా? పవన్ విజయమే డౌట్ అంటే ఇంక ఆ పార్టీ పరిస్థితి ఏమిటి?

''...జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా భీమవరం, గాజువాక పోటీచేయాలని సూచించారు. జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం స్థానాల్లో ఆ సర్వేలో అగ్రస్థానాల్లో నిలిచాయి. ఆఖరికి గాజువాక, భీమవరం ఎన్నుకున్నారు...'' ఇదీ వార్త.

అంటే జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు అంతలా మల్లగుల్లాలు పడిపోయారా? జస్ట్ తమ పార్టీనేత పోటీచేయాల్సిన సేఫ్ ఫ్లేస్ కోసం. అన్ని ప్రాంతాలు పరిశీలించి, ఆఖరికి వడబోసి, వడబోసి రెండుస్థానాలు ఎంచుకున్నారా? అంటే ఈ రెండు ప్లేస్ లు కాకుండా, మిగిలినవి అంత సేఫ్ కాదనే కదా? అర్థం.

పవన్ కే ఆంధ్రలోని 175 సీట్లలో అతి కష్టం మీద రెండుచోట్ల పోటీచేస్తే గెలిచే ప్లేస్ లు దొరికితే, మిగిలిన జన సైనికుల పరిస్థితి ఏమిటి? వాళ్లకు ఇంత సీన్, ఇంతలా ఎంచుకునే అవకాశం వుండదు కదా?

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments