సినిమా హీరోలకు కెరీర్ అంత వీజీ కాదు. దాన్ని ఎంత ప్లాన్డ్ గా డిజైన్ చేసుకుంటే అంత బాగుంటుంది. లక్ అనేది వేరే వ్యవహారం. ముందు ప్రయత్నమైతే చేయాలి. కెరీర్ ప్లానింగ్ లో బన్నీ తరువతే ఎవరయినా అనిపిస్తుంది. సన్నాఫ్ సత్య మూర్తి తరువాత సరైన మాస్ సినిమా చేయాలని బోయపాటిని ఎంచుకున్నాడు. ఇప్పుడు తరువాత ఏంటీ అన్నది. విక్రమ్ కుమార్, లింగుస్వామి ల్లో ఎవరో ఒకరితో చేయాలని వుంది.
కానీ వారిద్దరు కూడా మరో మూడు నాలుగు నెలలు పడుతుంది అంటున్నారు. కానీ బన్నీకి ఈ మూడు నాలుగు నెలల్లోగా ఓ సినిమా తీయగల డైరక్టర్..ఆయన దగ్గర ఓ సరైన కథ కావాలి. అందుకే ఓ ప్లాన్ వేసాడు. ఇటీవల హాలీడేకు టర్కీ వెళ్లే ముందు కొంతమంది డైరక్టర్లో గ్రూప్ డిస్కషన్ కు కూర్చున్నాడు. సుమారు పది మంది డైరక్టర్లు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారని వినికిడి.
వీరిలో వంశీ పైడిపల్లి, సంపత్ నంది తదితరులు వున్నారు. మూడు నెలల్లో సినిమా చేయగలమా.. మాంచి సబ్జెక్ట్ ఏమైనా వుందా? అనే ఓపెన్ ఆఫర్ ను బన్నీ డైరక్టర్ల ముందు వుంచి క్యాంప్ కు వెళ్లిపోయాడు. మరి అతగాడు వచ్చేసరికి ఎవరు..బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా వుండి చాన్స్ కొట్టేస్తారో మరి?