మహానాయకుడు..ఈసారి దేవుడికే ఎన్టీఆర్ పోలికలు!

ఎన్టీఆర్ గోప్పోడని చూపించడానికి.. కల్పించిన సన్నివేశాలు ట్రైలర్ దగ్గరే నవ్వుల పాలు అవుతున్నాయి. ఆల్రెడీ ఒక పార్టులో చేసిన భజన చాలదన్నట్టుగా.. ఇందులో పతాక స్థాయికి చేరిన భజన ఉంటుందని ట్రైలర్ తోనే స్పష్టం అవుతోంది. తొలిభాగంలో జనాలు బాగా విస్తుపోయిన సందర్భం..’ ఆయనలో దేవుడి పోలికలు ఉంటాయి..’ అనడం. అయితే రెండోపార్టులో దేవుడికే ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయన్నట్టుగా చూపించినట్టున్నారు.

ప్రత్యేకించి ఎన్టీఆర్ కటౌట్ ను శ్రీకృష్ణుడిగా భ్రమించి ఇందిరాగాంధీ పాత్రధారి నమస్కారం చేసుకోవడం.. పరాకాష్టకు చేరిన వ్యవహారం. ఒక దేశ ప్రధానిని.. అమెరికా అధ్యక్షులతో సైతం ధైర్యంగా సంభాషించిన ఏకైక భారత ప్రధానమంత్రిగా పేరున్న మహిళను.. ప్రతిపక్షానికి చెందిన  వాజ్ పేయి చేత ‘దుర్గ..’గా కీర్తింపబడిన ఇందిరను ఆఖరికి ఇంత దిగజార్చి చిత్రీకరించడానికి మించి.. ఈ సినిమా రూపకర్తల పతనావస్థ ఏముంటుంది?

ఎన్టీఆర్ గొప్పోడు.. ఎన్టీఆర్ గొప్పోడు.. దీనికోసమని ఎవరి గురించి అయినా ఇలాంటి కల్పిత సన్నివేశాలు క్రియేట్ చేయడమేనా! ఆల్రెడీ అలాంటి ప్రయత్నం చేసి తొలిభాగంలో వైఫల్యం చెందినా.. మళ్లీ అంతకు మించిన భజన చేయడం అంటే.. తెగించడమే. చరిత్రతో సంబంధం లేదు, ఎవరు ఏమనుకుంటారనే భయాలు ఏమీలేవు, కల్పిత ఘటనలతో.. ఇలా భారత దివంగత ప్రధానిని కూడా తమ సినిమా కటౌట్ ను కృష్ణుడిని పోల్చుకోని వ్యక్తిగా చూపించేశారు.

ఈ ఒక్క ఘట్టం చాలు.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూకు తటస్థులు పూర్తిగా దూరం కావడానికి! అయితే ఈ సినిమాను కూడా కలెక్షన్లను, విజయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. కేవలం ఎన్టీఆర్ భజన కోసం మాత్రమే రూపొందిచారనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్లో ఎన్టీఆర్ కటౌట్ కు ఇందిర దండం పెడుతున్నట్టుగా చూపితే.. అదే ఇందిరకు ఎన్టీఆర్ దండం పెడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీ కథ.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!