త్వరలో ఖైదీ భారీ సభ

తన నూటయాభయ్యవ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయినందుకు మెగా స్టార్ చిరంజీవి పిచ్చ హ్యాపీగా వున్నారు. ఈ విజయంలో తన ఫ్యాన్స్ పాత్ర ఎంతో ఆయనకు తెలియంది కాదు. అందుకే ఫ్యాన్స్ కోసం ఓ మెగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. 

విశాఖ లో చేస్తే ఎలా వుందనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ నే బెటర్ అనుకున్నారు. 28నే చేద్దామనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా వేసారు. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ గివెన్ మీట్ జరపాలని మెగాస్టార్ అండ్ కో డిసైడ్ అయ్యారు.

ఇందుకు కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం ను వేదికగా నిర్ణయించారు. అతి త్వరలో జరిగే ఈ థాంక్స్ గివెన్ మీట్ ను అభిమానులు కలకాలం గుర్తుంచుకునేలా నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Show comments