నోటా నా తప్పే.. ఈసారి గ్యాప్ తీసుకుంటా

నోటా సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని ఇప్పటికే అంగీకరించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడా ఫ్లాప్ పై సవివరంగా స్పందించాడు. ఆ సినిమా ఫ్లాప్ వెనక తనదైన రీజన్స్ ను చెప్పుకొచ్చాడు.

"నోటా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ కథ. ఆ కథలో ఇంటెన్సిటీ లోపించింది. మరింత బలంగా చెప్పాల్సింది మేము. అందుకే అది ఆడియన్స్ కు నచ్చలేదు. అయితే నోటా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. నిర్మాత బాగానే డబ్బు చేసుకున్నాడు."

ఇలా నోటా ఫ్లాప్ పై మరోసారి రియాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. నోటా విషయంలో ఏం జరుగుతుందో కూడా తనకు అర్థంకాలేదని, ఆ టైమ్ లో ఓవైపు గీతగోవిందం, మరోవైపు టాక్సీవాలా, ఇంకోవైపు నోటా కూడా ఉండడంతో.. నోటా కథపై ఫోకస్ తగ్గిందని చెప్పుకొచ్చాడు.

ఇకపై ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకుండా గ్యాప్ తీసుకుంటానని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఒక సినిమా మేజర్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా స్టార్ట్ చేస్తానంటున్నాడు. అందుకే డియర్ కామ్రేడ్ కు ఆ తర్వాతి సినిమాకు బాగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలిపాడు.

ఈ హీరో నటించిన టాక్సీవాలా సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. నోటా లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్నప్పటికీ ఆ ప్రభావం టాక్సీవాలాపై ఉండదని, రెండు సినిమాల జానర్స్ చాలా డిఫరెంట్ అంటున్నాడు.

Show comments