బాబు- పవన్ మీద పెద్ద బాధ్యతలు

టీడీపీ కూటమిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మీద పెద్ద బాధ్యతనే ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ పెట్టారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకుని రావాలని ఆయన కోరారు.

మిగిలినవి అన్నీ చిన్న విషయాలు.. హోదాయే ఏపీకి ముఖ్యమని ఆయన అంటున్నారు. హోదా వస్తే ఏపీలో వందలాది కంపెనీలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఈ విషయంలో బాబు- పవన్ కేంద్రంతో మాట్లాది ప్రత్యేక హోదా తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు పవన్ ఏపీలో 30 వేల పై దాటి ఆడవాళ్ళు అపహరణకు గురి అయ్యారని ఆరోపించారని తనకు కేంద్ర నిఘా సంస్థలు దీని మీద సమాచారం ఇచ్చాయని కూడా చెప్పారని గుర్తు చేశారు. ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ముప్పై వేల మంది మహిళలను వారి ఇళ్లకు చేర్చి కుటుంబాలకు ఆనందం కలిగించాలని పాల్ డిమాండ్ చేశారు.

కక్ష సాధింపు చర్యల కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. జగన్ ని తిట్టి అధికారంలోకి వచ్చారని అంత వరకూ బాగానే ఉంది కానీ ఇపుడు జగన్ గురించి ఇంకా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు మీరు ఇచ్చిన హామీల అమలుకు పనిచేయాలని బాబు పవన్ లను కేఏ పాల్ కోరారు. హోదా విషయం మాత్రం మరవ వద్దు అని ఆయన గట్టిగానే చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంటే అది పెద్ద బాధ్యత. కేంద్రం ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఏపీ నుంచి అడగాలి కదా అన్న డిమాండ్లు వస్తున్నాయి. Readmore!

Show comments