జగన్ లేఖకు అయ్యన్న క్లారిటీ ఇస్తారా?

ఏపీ కొత్త స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వైసీపీ అధినేత ఒక లేఖ రాసారు. ప్రతిపక్ష హోదా విషయంలో అందులో పేర్కొన్నారు. హోదా విషయం అన్నది  రాజ్యాంగంలో నిర్వచించలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలలో  ఎక్కువ నంబర్ ఎవరికి ఉంటే వారికే హోదా ఇవ్వాలని ఆయన అంటున్నారు.

ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కూడా చెప్పారు. జగన్ దీని మీద పరిశీలన చేయమని కొత్త స్పీకర్ కి చెబుతూనే జగన్ ఇంకా చావలేదు కదా అని అయ్యన్న ఎవరితోనో అన్నట్లుగా వచ్చిన వీడియోల ప్రస్తావన కూడా చేశారు.

అలా స్పీకర్ కి లేఖలో చెప్పాల్సిన మ్యాటర్ అంతా చెప్పేశారు. ఇపుడు బంతి స్పీకర్ కోర్టులో ఉంది. అయ్యన్న ఏమి నిర్ణయిస్తారు అన్నది చూడాలి. జూలై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు కనీసం వారం నుంచి పది రోజుల పాటు జరిగే వీలుంది

ఈ సమావేశాల్లోనే ప్రతిపక్ష స్థానం, హోదా అన్నవి స్పష్టతకు వస్తాయి. అయితే స్పీకర్ గా అయిన వెంటనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యన్న మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా వైసీపీకి లేదని తేల్చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవిస్తామని అలాగే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు. Readmore!

ఇది క్లియర్ గానే ఉంది. జగన్ కి అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చి కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎటూ సిద్ధంగా ఉండదని తెలుసు. స్పీకర్ ఈ విషయంలో క్లారిటీగా చెప్పేశారు. అయితే ఆ సమయంలో జగన్ వైపు నుంచి ఏ విధమైన రిక్వెస్ట్ లేదు. ఇపుడు పరిశీలించమని కోరుతూ లేఖ రాశారు.

దాంతో స్పీకర్ కొత్తగా ఏమి ఆలోచిస్తారు అన్నది ఆసక్తిని పెంచుతున్న విషయం. అయితే అసెంబ్లీకి వస్తే గౌరవిస్తామనే చెబుతారా లేక హోదా అన్నది నిబంధనలకు లోబడి ఎమ్మెల్యేల సంఖ్య లేనందువల్ల ఇవ్వలేమని చెబుతారా అన్నది చూడాలి. టీడీపీ మంత్రులు నేతల వ్యాఖ్యలు చూస్తే హోదా అన్నది ఇచ్చేందుకు నో అన్నట్లుగానే ఉంది.

హోదా ఇస్తే ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఇంకా చాలా ఉంటాయి. దాంతో అలాంటి వాటి జోలికి అయితే కూటమి పెద్దలు పోరు అనే అంటున్నారు. జగన్ కి ఇవి తెలియనివి కావు. అయితే తన మీద నింద లేకుండా అసెంబ్లీ పెద్దలు ప్రభుత్వ పెద్దల మనోగతం ఏమిటి అన్నది జనాలకు చెప్పాలన్న ఉద్దేశ్యం కాబోలు. అయితే రూల్స్ అని ప్రభుత్వం కానీ సభ కానీ చెబుతున్నపుడు జనాల నుంచి కూడా వైసీపీకి పాజిటివ్ గా రియాక్షన్ ఏమి ఉంటుంది అన్నదే చూడాలి.

Show comments