నాడు సస్పెండ్ అయ్యారు... నేడు వీసీ అయ్యారు.

గతంలో అంటే వైసీపీ విపక్షంలో ఉన్నపుడు యువభేరీల పేరిట ఏపీలో సదస్సులు సమావేశాలూ నిర్వహించింది. నాడు విద్యావేత్తలను, విద్యార్ధులను పిలిచి మరీ ప్రత్యేక హోదాతో పాటు అనేక ఇతర అంశాల మీద వారిలో జగన్ చైతన్యం కలిగించారు. యువతకు కొత్త రాష్ట్రంలో దక్కాల్సిన హక్కులు గురించి కూడా అవగాహన కలిగించారు.

నాడు విశాఖలో నిర్వహించిన యువభేరీకి హాజరు  అయ్యారన్న ఏకైక  కారణంతో నాడు ఆంధ్రా యూనివర్శిటీ అధ్యాపకుడిగా ఉన్న ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని టీడీపీ సర్కార్ సస్పెండ్ చేసింది.

ఇక ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. వందేళ్లకు చేరువ అవుతున్న ప్రతిష్టాత్మకమైన అంధ్రా యూనివర్సిటీకి వైఎస్ చాన్సలర్ గా అదే ప్రసాదరెడ్డికి పిలిచి మరీ పట్టం కట్టింది.

ఉత్తమ ప్రొఫెసర్ గానే కాక‌ విద్యార్ధులకు మంచి బోధకుడిగా ఉన్న ప్రసాదరెడ్డికి వీసీ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయన మూడేళ్ళ పాటు ఈ పదవిలో ఉంటారు.

2026లో వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న ఏయూ శత వసంత ఉత్సవాలకు ఇప్పటి నుంచే సన్నాహాలను కూడా కొత్త వీసీ ఆద్వర్యంలో చేయబోతూండడం విశేషం.

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments