కంగ్రాట్స్ డియ‌ర్‌.. నారా బ్రాహ్మ‌ణి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

ఇవాళ మంత్రిగా నారా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త స‌మ‌ర్థ‌త‌పై నారా బ్రాహ్మ‌ణి ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసిన వారే ఆశ్చ‌ర్య‌పోయేలా నువ్వేంటో నిరూపించుకున్నావ‌ని అభినందించారు. ఎక్స్‌లో బ్రాహ్మ‌ణి పెట్టిన‌ పోస్టు ఏంటో తెలుసుకుందాం.

"అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్"

గ‌తంలో లోకేశ్ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధితో పాటు ఐటీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. అదే విష‌యాన్ని బ్రాహ్మ‌ణి ప‌రోక్షంగా గుర్తు చేశారు. అప్ప‌ట్లో ప‌ల్లెల‌ను అభివృద్ధి చేసి వాటి రూపురేఖ‌లు మార్చావ‌ని లోకేశ్‌ను బ్రాహ్మ‌ణి ప్ర‌శంసించారు. తాజాగా స‌చివాల‌యంలోని నాల్గో బ్లాక్‌లో త‌న చాంబ‌ర్‌లో ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖ‌ల బాధ్య‌త‌ల్ని లోకేశ్ చేప‌ట్టారు.

ఈ శాఖ‌ల్ని ఎంతో సాహ‌సంతో లోకేశ్ చేప‌ట్టిన‌ట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ శాఖ‌ల‌తో నేటి త‌రంతో పాటు భ‌విష్య‌త్ త‌రాల జీవితాల్ని మార్చ‌గ‌ల‌వ‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని భ‌ర్త‌పై ఎంతో న‌మ్మ‌కాన్ని ఆమె చాటుకున్నారు. కుటుంబ ప‌రంగా తమ స‌హ‌కారం వుంటుంద‌ని ఆమె వెల్ల‌డించారు. Readmore!

Show comments