చిరంజీవి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం లేదు

సరిగ్గా పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఇవ్వాల్సిన స్పష్టత ఇచ్చేశారు చిరంజీవి. తను రాజకీయాలకు దూరం అని మరోసారి స్పష్టం చేస్తూనే, తను కేవలం తన రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడికి మాత్రమే మద్దతిచ్చానని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో దిగడం లేదని ప్రకటించారు.

"నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను. ప్రచారానికి పిఠాపురం నేను వెళ్లడం లేదు. మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. నేను రావాలని కల్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ కు వదిలేశాడు. పవన్ బాగుండాలి, అనుకున్నది సాధించాలని నేను కోరుకుంటాను. తనతో పాటు నేను ఉన్నానని చెప్పేందుకు ఈమధ్య వీడియో రిలీజ్ చేశాను."

తమ్ముడి అభివృద్ధిని, ఆయన రాజకీయంగా ఎదగాలని మెగా కుటుంబ సభ్యులంతా మనసావాచా కోరుకుంటామని అన్నారు చిరంజీవి. ఢిల్లీ వెళ్లి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ క్లారిటీ ఇచ్చారు.

ప్రచారానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఫినిషింగ్ టచ్ గా, ఆఖరి నిమిషంలో చిరంజీవి రంగంలోకి దిగుతారని, పిఠాపురంలో సుడిగాలి పర్యటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అవన్నీ ప్రచారాలు మాత్రమేనని చిరంజీవి కొట్టిపారేశారు.

Readmore!

తన మద్దతు తమ్ముడు పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉంటుందని తెలిపిన చిరంజీవి, కొన్ని రోజుల కిందట సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపారు. వాళ్లకు ఓటేయాల్సిందిగా వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా కిషన్ రెడ్డిని చిరంజీవి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

Show comments

Related Stories :