సలార్ 2 అసలు సంగతి ఇదా?

సలార్ 2 సినిమా ఇప్పట్లో వుండదని అంతా అనుకుంటున్న మాట. హీరో ప్రభాస్ ఫుల్ బిజీగా వున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ వేరే ప్రాజెక్ట్ చేసిన తరువాత సలార్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇలాంటి వార్తలు అన్నీ వినిపిస్తూ వచ్చాయి. కానీ ఈ నెలాఖరులో సలార్ 2 షూట్ స్టార్ట్ అవుతుంది అని ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తోంది.

అసలు ఏం జరుగుతోంది. ఏమిటి సంగతి? ఇప్పటి నుంచి ప్రశాంత్ నీల్ సలార్ 2 మీదకు వెళ్తే, ఇక ఎన్టీఆర్ సినిమా మీదకు వచ్చేది ఎప్పుడు? ప్రభాస్ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో సలార్ 2 సినిమాను ముందుగానో, సమాంతరంగానో చేస్తే, మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా వుంటుంది?

ఈ నేపథ్యంలో ఓ గమ్మత్తైన విషయం తెలుస్తోంది. సలార్ 2 సినిమా షూట్ ప్రారంభించడానికి వేరై రీజన్ వుందని తెలుస్తోంది. సలార్ లో మాదిరిగానే సలార్ 2 లో ఇద్దరు హీరోలైన ప్రభాస్, పృధ్వీరాజ్ పాత్రల చిన్నతనం ఎపిసోడ్ కొంత వుంటుందట అక్కడక్కడ. ఆ పాత్రలను వేరే యంగ్ కుర్రాళ్లు సలార్ లో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లే మళ్లీ ఆ పాత్రలు చేయాలి. లేదంటే కంటిన్యూటీ సమస్య వస్తుంది.

ఆ కుర్రాళ్లు కాస్త పెద్దవుతున్నారు. సలార్ మొదలుపెట్టినపుడు వాళ్లతో ఎపిసోడ్ లు తీసారు. రెండేళ్లు దాటిపోతోంది. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే ఆ కుర్రాళ్లు ఇంకా పెద్దయిపోతారు. దాంతో యంగ్ హీరోల లుక్ వస్తుంది. అందువల్ల ముందుగా వాళ్లతో అనుకున్న సీన్లు అర్జంట్ గా తీసేయాలన్నది సలార్ 2 మేకర్ల ఆలోచనగా తెలుస్తోంది.

Readmore!

ఆ తరువాత సినిమా ఎప్పుడు చేసుకున్ సమస్య వుండదు. ఇది ఎంత వరకు నిజం అన్నది సలార్ 2 షూట్ స్టార్ట్ కాగానే తెలుస్తుంది.

Show comments

Related Stories :