పీఎఫ్ఐ పై బ్యాన్.. జాతి భద్రతకే పెను ముప్పు

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఐదేళ్ల పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఫీఎఫ్ఐ)ని, దాని అనుబంధ సంస్థల‌ను, చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ కేంద్రం ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో యూఏపీఏలోని సెక్షన్ 35 కింద పీఎఫ్‌ఐని 42 నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు.

పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మొద‌ట కేర‌ళ‌లో 2006 ఏర్పాటు అయి దేశమంత‌టా విస్త‌రించింది. దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఢిల్లీలో ఉంది. మైనారిటీలు, ద‌ళితులు, అణ‌గారిన వ‌ర్గాల సాధికార‌త కోసం ప‌ని చేస్తున్న‌ట్లు న‌టిస్తూ ఆ ముసుగులో రాడిక‌ల్ ఇస్లాంను ప్ర‌చారం చేస్తోంద‌ని దేశ భ‌ద్ర‌తా సంస్థ‌లు ఆరోపించాయి. 

క‌రాటే పేరుతో యువ‌త‌కు ఉగ్ర‌వాద శిక్ష‌ణ ఇవ్వ‌డం, అమాయ‌క యువ‌త‌ను రెచ్చ‌గోట్టి ఉగ్ర‌వాదం వైపు ప్రోత్స‌హించ‌డం వంటి కార్య‌క‌లాపాలు చేస్తున్న‌ట్లు ఫీఎఫ్ఐపై ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో కేంద్రం నిషేదం విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం ఇందుకు అసలైన కారణాలుగా తెలుస్తోంది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించినట్టు సమాచారం.

ఇప్ప‌టికై దేశం అంతటా పీఎఫ్ఐ కార్యాల‌యాలు, నాయ‌కుల‌పై కేంద్ర భ‌ద్ర‌త సంస్థ‌లు సోదాలు చేసి వంద‌ల మందిని ఆరెస్ట్ చేసింది. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్స్, పెన్‌డ్రైవ్స్ సహా పలు ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Show comments