ఆ హీరో సినిమాలా? నో ఫైనాన్స్ ?

అసలే టాలీవుడ్ లో సినిమాలకు ఫైనాన్స్ సమస్య వచ్చి పడింది. బడా ఫైనాన్సియర్లు సినిమాలకు ఫైనాన్స్ చేయడం విషయంలో ఓ స్వీయ నియంత్రణకు వచ్చేసారు. 

మరీ ఎక్కువ క్రెడిబులిటీ వుండి, ప్రామిసింగ్ ప్రాజెక్టులు అయితేనే ముందుకు వస్తున్నారు. లేదంటే అస్సలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో ఒక హీరో సినిమాలు అయితే అస్సలు ఫైనాన్సే ఇవ్వమంటున్నారని తెలుస్తోంది.

ఆ హీరో సినిమాలు ఎప్పుడు ప్రారంభవుతాయో, ఎప్పుడు షూట్ జరుపుకుంటాయో, ఎప్పుడు విడుదల అవుతాయో అన్నది అగమ్యగోచరం. అలా పడి వుంటాయంతే. 

అందుకే ఆ ప్రాజెక్టులకు కానీ, ఇంకా ప్లానింగ్ లో వున్నవాటికి కానీ ఫండింగ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో సదరు హీరోతో నిర్మాణాలు ప్లాన్ చేసుకున్నవారంతా కిందా మీదా పడుతున్నారని తెలుస్తోంది.

మూడు సినిమాలు షూటింగ్ లోనో, ప్లానింగ్ లోనో వున్నాయి. మూడింటి పరిస్థితి ఇదే అని తెలుస్తోంది. 

Show comments