ప్రభాస్ రికార్డ్.. సెట్స్ పై 4 సినిమాలు

పెద్ద హీరోలంతా ఒకటి లేదా రెండు సినిమాలతోనే నెట్టుకొస్తుంటే.. ప్రభాస్ మాత్రం ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ 4 సినిమాలు చేతిలో ఉండడం గొప్ప కాదు, ఆ 4 సినిమాలు సెట్స్ పై ఉండడం విశేషం. అవును.. ఇన్నాళ్లూ పెండింగ్ లో ఉన్న నాగ్ అశ్విన్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు ప్రభాస్.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఈరోజు లాంఛ్ అయింది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు.

వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ సినిమా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ముందుగా అమితాబ్ బచ్చన్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది ఈ సినిమా. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

ఈ సినిమాతో ప్రభాస్ 4 సినిమాలు సెట్స్ పైకి వచ్చినట్టయింది. ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ ముంబయిలో జరుగుతోంది. రాధేశ్యామ్ షూట్ మరో వారం రోజుల వర్క్ పెండింగ్ ఉంది. సలార్ సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమా కూడా మొదలైంది. 

Show comments