డైరక్టర్-హీరోయిన్ చెట్టపట్టాల్?

హీరో హీరోయిన్లు చెట్టపట్టాలు వేసుకుంటారు సినిమాల్లో. అది వారి నటన. కానీ ఆఫ్ ది స్క్రీన్ లో కూడా హీరో హీరోయిన్లు, డైరక్టర్ హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని ఎంజాయ్ చేయడం అన్నది ఈ మధ్య కాస్త కామన్ అయిపోయింది.

బాలీవుడ్ హీరోయిన్లే కాదు, బాలీవుడ్ సంస్కృతి కూడా ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువైంది. ఓ మిడిల్ రేంజ్ డైరక్టర్ ఒకరు. ఒక స్మాల్ హీరోయిన్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ డైరక్టర్ సర్రున దూసుకువచ్చి చకచకా సినిమాలు చేసారు. ఫట్ మని ఓ డిజాస్టర్ పలకరించడంతో బాగా గ్యాప్ ఇచ్చారు. ఆఖరికి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. 

ఈ హీరోయన్ తెలుగు-తమిళంలో కలిపి గట్టిగా డజను సినిమాలు చేయలేదు. లాస్ట్ ఇయర్ ఓ బ్లాక్ బస్టర్ లో నటించింది. ఈ ఏడాది ఓ డీసెంట్ హిట్ లో కనిపించింది. ప్రస్తుతం మరో రెండు మూడు సినిమాల్లో కనిపించబోతోంది.

మరి ఈ ఇద్దరికీ ఎక్కడ ఎలా కలిసిందో కానీ, మాంచి స్నేహం, అంతకు మించిన చనువు మెయింటెయిన్ చేస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసల సారాశం.

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

క‌మ్మవాళ్ళు వైఎస్ కు ఓట్లేసింది అందుకే 

Show comments