ఓరేయ్ బుజ్జిగా...ట్రయిలరొచ్చింది

కరోనా కారణంగా ఇబ్బందుల్లో పడిన సినిమాల్లో రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో తయారైన ఒరేయ్ బుజ్జిగా ఒకటి. కేకె రాధామోహన్ నిర్మాత. ఇప్పుడు నేరుగా ఓటిటిలో విడుదలవుతోంది. అక్టోబర్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ట్రయిలన్ ను ఆన్ లైన్ లో విడుదల చేసారు.

ఈ మధ్యకాలంలో ఫుల్ ఫన్ నిండిన చిన్న సినిమాలు కరువైపోయాయి. పెద్ద హీరోలే కామెడీ కూడా చేసేస్తున్నారు. రాజ్ తరుణ్ తో కలిసి బోలెడు మంది సీనియర్ అండ్ సీజన్డ్ ఆర్టిస్టులు అంతా కామెడీ పండించినట్లు ట్రయిలర్ చూస్తూనే తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగే వుంది ట్రయిలర్.

సత్య, పోసాని, సప్తగిరి ఇలా చాలా మంది ఆర్టిస్టులు వున్నారు. పక్కగా పైసా వసూల్ సినిమా అయ్యేలాగే వుంది ట్రయిలర్ చూస్తుంటే. రాజ్ తరుణ్ చిరకాలంగా హిట్ లేకుండా వుండిపోయాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవతాడేమో చూడాలి మరి.

Show comments