కేసీఆర్‌తో ఆర్‌కేకు కుదిరిన బేరం

హ‌మ్మ‌య్యా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై చ‌ల్ల‌ని చూపు చూశారు. కేసీఆర్‌తో ఆర్‌కేకు బేరం కుదిరింది. కొన్ని రోజులుగా తెలంగాణ ఆంధ్ర‌జ్యోతిలో ఎడిష‌న్‌లో ప్ర‌భుత్వానికి బాకా ఊదుతూ క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్న‌ప్పుడే పాఠ‌కుల‌కు అనుమానం వ‌చ్చింది. కేసీఆర్‌తో ఆర్‌కేకు స‌యోధ్య కుదిరింద‌ని ఆంధ్ర‌జ్యోతి అక్ష‌ర‌మే చెబుతోంది.

ఈ వేళ తెలంగాణ ఎడిష‌న‌ల్‌లో మెయిన్ ఫ‌స్ట్ పేజీ...అదీ ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న ఆంధ్ర‌జ్యోతిలో క‌నిపించ‌గానే తెలంగాణ పాఠ‌కుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింది. అక్ష‌ర‌మే ఆయుధ‌మ‌ని బీరాలు ప‌లికే ఆర్‌కే...ఆ ఆయుధం డ‌బ్బు సంపాదించ‌డానికే త‌ప్ప అభాగ్యుల పాలిట అభ‌య‌హ‌స్తం కాద‌ని నిరూపిత‌మైంది. కిరోసిన్ వ్యాపారిగా ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన ఆర్‌కే...అక్ష‌రం కూడా కిరోసిన్ లాంటిదేన‌ని బ‌లంగా న‌మ్ముతాడు. ఎందుకంటే దేన్నైనా త‌గ‌ల‌బెట్ట‌డానికి కిరోసిన్‌ను వాడిన‌ట్టే....త‌న‌కు గిట్ట‌ని వాళ్ల వ్య‌క్తిత్వాన్ని మంట‌గ‌ల‌ప‌డానికి అక్ష‌రాన్ని ఓ ప‌నిముట్టుగా వాడ‌టంలో ఆర్‌కే సిద్ధ‌హ‌స్తుడ‌నే విమ‌ర్శ‌లున్నాయి.

బ‌హుశా మూడు నాలుగు నెల‌ల క్రితం మాట‌. ఆంధ్ర‌జ్యోతికి తెలంగాణ స‌ర్కార్ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేదంటూ ఆ ప‌త్రిక ఎడిట‌ర్ జాతీయ స్థాయిలో మీడియా సంబంధిత రాజ్యాంగ సంస్థ‌ల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేలా ప్ర‌భు త్వాన్ని ఆదేశించాల‌ని ఆ ఫిర్యాదులో ఎడిట‌ర్ అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ వేళ కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్ట్‌ను శుక్ర‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ ప్రారంభించ‌డానికి సంబంధించిన యాడ్ ఆంధ్ర‌జ్యోతిలో క‌నిపించింది. ఈ ప్ర‌క‌ట‌న గ‌జ్వేల్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన‌ట్టుగా ఉంది.

తెలంగాణ‌లో కేసీఆర్ రుణాన్ని తీర్చుకునేందుకు ఆర్‌కే మున్ముందు ఏం చేస్తాడో చూడండి. ఒళ్లుపై వ‌స్త్రం లేకుండా అక్ష‌రంతో జ‌జ్జ‌న‌క తొక్క‌క‌పోతే ఆయ‌న పేరు ఆర్‌కే కాదు. మ‌రే పేరైనా పెట్టుకోవ‌చ్చు. ఏపీ సీఎం జ‌గ‌న్ ఓ చ‌ల్ల‌ని చూపు చూడ‌మ‌నండి...ఆ మ‌రుస‌టి రోజు నుంచే జై జ‌గ‌న్ అని అన‌క‌పోడు. అక్ష‌రాన్ని వ్యాపారంగా భావించే వాళ్ల‌కు ఆదాయంతో త‌ప్ప వ్య‌క్తుల‌తో ప‌నేం ఉంటుంది?

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

తప్పుడు వార్తలు రాసిన మీడియాపై సమగ్ర విచారణ

Show comments