బ్రెయిన్ ప‌వ‌ర్ ను పెంచే 8 స‌ర్ ప్రైజింగ్ థింగ్స్!

ప్ర‌తి రోజూ వ్యాయామం చేసే అల‌వాటున్న వాళ్లు ఆ ప‌ని పూర్తి కాగానే ఒక చిన్న కునుకు తీస్తే... మెమొరీ ప‌వ‌ర్ పెరుగుతుంది అని అంటోంది ఒక అధ్య‌య‌నం! ఇలా బ్రెయిన్ ప‌వ‌ర్ ను పెంచుకునేందుకు ఉన్న ఎనిమిది భిన్న‌మైన మార్గాలు ఇవి. 

మ‌నిషి మెద‌డు చాలా డైనమిక్, దాని ప‌వ‌ర్ ఒక్కోసారి ఒక్కోలా ఉండ‌వచ్చు. మ‌నం తినే తిండి, చేసే వ్యాయామం కూడా మెద‌డు ప‌నితీరును నిర్దేశిస్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో మెద‌డు ప‌దును పెంచుకోవ‌డానికి ఉన్న మార్గాల‌ను ప‌రిశీలిస్తే.. 

ఆలోచించేట‌ప్పుడు క‌ళ్లు మూసుకోవ‌డం...

ఈ అల‌వాటు చాలా మందికే ఉంటుంది. దేన్నైనా గుర్తు చేసుకోవ‌డానికి, ఆలోచించ‌డానికి, ఏదైనా స‌మాధానం చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు క‌ళ్లు మూసుకుని థింక్ చేస్తూ ఉంటారు కొంత‌మంది. త‌ల కాస్త వెన‌క్కు వాల్చి, క‌ళ్లు మూసుకుని ఆలోచిస్తే.. మెమొరీ ప‌వ‌ర్ బూస్ట‌ప్ అవుతున్న విష‌యాన్ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇలా చేస్తే మామూలు క‌న్నా 30 శాతం ఎక్కువ షార్ప్ గా మెద‌డు స్పందించ‌డాన్ని వారు గుర్తించారు.

మ‌న‌తో మ‌నం మాట్లాడుకోవ‌డం..

త‌న‌తో తాను మాట్లాడుకునే వ్య‌క్తుల‌ను పిచ్చోళ్లు అంటుంది స‌మాజం. అయితే వాళ్ల జ‌డ్జిమెంట్ తో ప‌ని లేదు.. మ‌న‌తో మ‌నం సంభాషించుకోవ‌డం అనేది చాలా మంచి టెక్నిక్ అని చెబుతున్నారు. గుర్తుంచుకోవాల్సిన అంశాల‌ను మ‌నం వివ‌రించుకోవ‌డాన్ని ప్రొడ‌క్ష‌న్ ఎఫెక్ట్ అని అంటున్నారు ప‌రిశోధ‌కులు. అలా మ‌న‌కు మ‌నం వివ‌రించుకోవ‌డం వ‌ల్ల ఆ విష‌యం పూర్తిగా గుర్తుండిపోతుంద‌నేది ప‌రిశోధ‌కుల మాట‌.

బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ ను చెక్ చేసుకోండి..

హై బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ తో ఇబ్బంది ప‌డేవాళ్లు మెమొరీ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటార‌ని అంటోంది యూనివ‌ర్సిటీ ఆఫ్ అల‌బామా అధ్య‌య‌నం. వాళ్ల‌లో థింకింగ్ స్కిల్స్ క్షీణిస్తాయ‌ని అంటోంది. హై బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ వ‌ల్ల మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ వేగం త‌గ్గ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంద‌ని వారు తేల్చారు.

పాట పాడండి..

సింగింగ్ కాంపిటీష‌న్ల‌లో పార్టిసిపేట్ చేయాల‌ని అన‌డం లేదు, స‌ర‌దాగా మీకే విన‌ప‌డేలా రాగం తీయ‌మంటున్నారు ప‌రిశోధ‌కులు. పాట‌లు పాడేట‌ప్పుడు మెద‌డులో కుడి భాగం ప‌ని చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ ఎబిలిటీ బాగా పెరుగుతుంద‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు. కొత్త కొత్త పాట‌లు విన‌డం, వాటి ప‌దాల‌ను గుర్తు పెట్టుకోవ‌డం మంచి యాక్టివిటీ అని వారు వివ‌రిస్తున్నారు.  

పుర చేతిని ఉప‌యోగించండి!

ప్ర‌తి మ‌నిషికీ ఒక్కో చేతి వాటం ఉంటుంది. మెజారిటీ మందికి కుడి చేతి వాట‌మే ఉంటుంది. ప్ర‌ధానంగా అన్ని ప‌నుల‌కూ కుడి చేతినే ఉప‌యోగించ‌డం అల‌వాటు. బ‌ల‌మంతా కుడి చేతిలోనే ఉంటుంది. అలాంటి వారు అప్పుడ‌ప్పుడైనా ఎడ‌మ చేతిని ఉప‌యోగించడం మంచి ప‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. అదే ఎడ‌మ చేతి వాటం వారు.. అప్పుడ‌ప్పుడు కుడి చేతికి ప‌ని చెప్పాలట‌. దీని వ‌ల్ల బ్రెయిన్ కొన్ని కొత్త పాత్ వేస్ ను, క‌నెక్ష‌న్స్ ను ఏర్ప‌రుచుకుంటుంద‌ట‌. అలా కాకుండా.. ఎప్పుడూ ఒకే చేత్తో ప‌ని చేస్తుంటే.. మెద‌డులోని ఒక భాగానికే ఎక్కువ ప‌ని ఉంటుంద‌ట‌. బ్ర‌ష్షింగ్, కంప్యూట‌ర్ మౌస్ ను ఉప‌యోగంచ‌డం.. వంటి ప‌నుల‌ను అప్పుడ‌ప్పుడు రెగ్యుల‌ర్ హ్యాండ్ తో కాకుండా వేరే చేత్తో చేయాల‌ని ఇది బ్రెయిన్ ప‌వ‌ర్ ను డెవ‌ల‌ప్ చేస్తుంద‌నేది ప‌రిశోధ‌కుల మాట‌. 

మెడిటేష‌న్, యోగ‌...

రోజుకు క‌నీసం 15 నుంచి 30 నిమిషాల చొప్పున ఎనిమిది వారాల పాటు మెడిటేష‌న్ చేసిన వారిలో బ్రెయిన్ ప‌వ‌ర్  పెరిగిన‌ట్టుగా చెబుతున్నారు ప‌రిశోధ‌కులు. అలాగే యోగా కూడా మెద‌డులో లొకేష‌న్స్ ను గుర్తించే ప‌రిజ్ఞానాన్ని పెంచుతుంద‌ట‌. 

పెన్సిల్ యూజ్ చేయండి..

రాత ప‌ని చాలా మంది ఆపేస్తున్నారు. కంప్యూట‌ర్లు వినియోగంలోకి వ‌చ్చాకా.. దేన్నైనా కీ బోర్డు మీదే టైప్ చేయ‌డం. అయితే అలా కాకుండా.. పెన్నో, పెన్సిలో తీసుకుని.. పేప‌ర్ మీద అలా డూడుల్ చేయ‌డం అనేది చాలా మంచి యాక్టివిటీ అని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దేన్నైనా స్ట‌డీ చేసేట‌ప్పుడు, వినేట‌ప్పుడు కూడా కంప్యూట‌ర్లో టైప్ చేయ‌డం క‌న్నా.. పేప‌ర్ మీద రాసుకుంటేనే అది ఎక్కువ‌గా మ‌న‌కు గుర్తుంటుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

మార్పులు చేస్తూ ఉండాలి..

డిన్న‌ర్ టేబుల్ వ‌ద్ద రోజు వారీగా వేర్వేరు కుర్చీల్లో కూర్చోవ‌డం, రోజూ వెళ్లే చోట‌కు కొత్త దారిన వెళ్ల‌డం, టీవీ చూసేట‌ప్పుడు కూడా వేర్వేరు ప్లేస్ ల‌లో వేర్వేరు యాంగిల్స్ లో కూర్చుని చూడ‌టం.. ఇవ‌న్నీ కూడా మెద‌డును ప్ర‌భావితం చేసే యాక్టివిటీస్ అని అంటున్నారు ప‌రిశోధ‌కులు. వీటిని అనుస‌రిస్తూ మెద‌డును షార్ప్ గా ఉంచుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. 

మన పాలన-మీ సూచన, 4వ రోజు

Show comments