ఇలా పెళ్లి చేసుకున్నాడు.. అలా జంప్ అయ్యాడు

ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు. తన ప్రేమ విషయాన్ని పేరెంట్స్ తో చెప్పలేకపోయాడు. బలవంతంగా తాళి కట్టించారు. 4 రోజులు కాపురం కూడా చేయించారు. కానీ అబ్బాయి మనసును మాత్రం మార్చలేకపోయారు. ఫలితంగా పెళ్లయిన 4 రోజులకే భార్యను వదిలి పారిపోయాడు పెళ్లికొడుకు/భర్త. కర్నూలులో జరిగింది ఈ ఘటన.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన వీర కుమార్, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పేరుకు వీరకుమార్ అయినప్పటికీ తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పలేకపోయాడు. తల్లిదండ్రుల బలవంతం మేరకు, లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొద్ది మంది బంధువుల సమక్షంలో మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు.

అయితే 4 రోజులు కూడా కాపురం చేయలేకపోయాడు. తన కొత్త భార్యను వదిలేసి, పాత ప్రేయసి వద్దకు పారిపోయాడు. అబ్బాయి కనిపించకపోవడంతో అమ్మాయి తరఫు బంధువులు ఆరాతీశారు. తన కోసం వెతకొద్దని వీరకుమార్ ఫోన్ లో చెప్పి స్విచాఫ్ చేశాడు. హైదరాబాద్ లో తను ప్రేమించిన అమ్మాయి దగ్గరకే వీరకుమార్ వెళ్లి ఉంటాడని భార్యతరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

మొత్తానికి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటో ఆల్బమ్ కూడా ఇంకా రాలేదు. అంతలోనే వీరకుమార్ ఇలా పరారయ్యాడు. 

టీటీడీ భూములు బేరం పెట్టిందే మీరు

Show comments