కరోనా టెర్రర్.. టాప్-10లో చేరిన భారత్

ఏ భారతీయుడు కోరుకోని 'ఘనత'ను సాధించింది ఇండియా. అవును.. కరోనా కేసుల్లో ప్రపంచదేశాల్లో టాప్-10 జాబితాలోకి ఎగబాకింది. మొన్నటివరకు భారత్ లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండేది. ఎప్పుడైతే లాక్ డౌన్-4 పేరుచెప్పి మినహాయింపులు ఎక్కువగా ఇచ్చారో, అప్పట్నుంచి కేసుల సంఖ్య పెరగడం ఎక్కువైంది. అలా ఇప్పుడు కేసుల పరంగా ప్రపంచదేశాల్లో పదో స్థానంలో నిలిచింది భారత్.

నిన్నటి వరకు పదో స్థానంలో ఇరాన్ కొనసాగింది. రోజుకు సగటున 2వేల కేసుల నమోదుతో లక్షా 35వేల మంది కరోనా బాధితులతో ఇరాన్ నిలిచింది. అయితే ఇండియాలో ఎప్పుడైతే రోజుకు సగటున 4వేల కేసులు నమోదవ్వడం ప్రారంభమైందో అప్పుడే ఇరాన్ ను అధిగమించి టాప్-10 జాబితాలో చేరిపోయింది భారత్. ప్రస్తుతం భారత్ లో కరోనా బాధితుల సంఖ్య లక్షా 38వేలు దాటింది.

ప్రపంచదేశాల్లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత స్థానం బ్రెజిల్ దే. అమెరికాలో నిన్న ఒక్కరోజు 19,608 కొత్త కేసులు నమోదవ్వగా.. బ్రెజిల్ లో గడిచిన 24 గంటల్లో 16,220 కొత్త కేసులు వెలుగుచూశాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 16లక్షల 85వేలకు చేరుకోగా.. బ్రెజిల్ లో కేసుల సంఖ్య 3 లక్షల 63వేలకు చేరుకున్నాయి.

ఇక మృతులపరంగా చూసుకుంటే అగ్రరాజ్యం చరిత్రలోనే కనివినీ ఎరుగని ఘోరంగా కరోనా విలయం నిలిచిందని చెప్పొచ్చు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువైంది. ప్రస్తుతం 99,300 మరణాలు చోటుచేసుకోగా.. మరికొన్ని గంటల్లో లక్షకు చేరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓవైపు వైరస్ అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోజుకు సగటున 600 మంది మరణిస్తున్నారు.

అమెరికా తర్వాత అత్యథికంగా బ్రిటన్ (36,793), ఇటలీ (32,785), స్పెయిన్ (28,752), ఫ్రాన్స్ (28,367) దేశాల్లో కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ దేశాల్లో కరోనా వ్యాప్తి దాదాపు అదుపులోకి వచ్చింది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు.. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు ఫ్రాన్స్ నే తీసుకుంటే గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 115 కేసులు మాత్రమే నమోదవ్వగా.. 35 మంది మరణించారు.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పరంగా సమస్యాత్మకంగా కనిపిస్తున్న దేశాలు అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా మాత్రమే. 

ప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

Show comments