మురుగదాస్ ఫీలయ్యారు?

కత్తి సినిమాకు కత్తిలాంటి స్క్రిప్ట్ సమకూర్చింది డైరక్టర్ మురుగదాస్. కత్తి సినిమాకు కమర్షియల్ హంగులతో పాటు, మంచి పొటెన్షియాలిటీ, ఎమోషనల్ కేలిబిర్ తో కూడిన స్క్రిప్ట్ ను అందించాడు అతను. ఆ సినిమా రీమేక్ ఖైదీ నెంబర్ 150 ని మురుగదాస్ తొలి రోజే హైదరాబాద్ లో చూసారు.

మహేష్ సినిమా పని మీద ప్రస్తుతం మురుగదాస్ ఇక్కడే వున్నారు. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాలో కామెడీ ట్రాక్ చూసి మురుగదాస్ చాలా ఫీలయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మురుగదాస్ కు లిక్కర్ అంటే కిట్టదు. తుపాకి సినిమాలో విలన్ కూడా గ్రీన్ టీ తాగుతున్నట్లు చూపించారు మురుగదాస్. 

అలాంటిది ఖైదీ నెంబర్ 150 సినిమా హీరో కు కమెడియన్ కు మధ్య ట్రాక్ మొత్తం లిక్కర్ తోనే నడవడం చూసి, ఆయన ఇదేంటిలా? అని తనతో వున్నవారితో ఒపీనియన్ షేర్ చేసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా ఆలీకి ఆడవేషం వేయడం పై కూడా ఇదేం కామెడీ, మరింకేదైనా ఆలోచించవచ్చు కదా అని ఫీలయినట్లు తెలుస్తోంది. కానీ మన మాస్ జనాల టేస్ట్ అలాగే వుంటుందని మురగదాస్ కు తెలియదేమో?

Show comments