నయనతార నో అంటున్న.. ఆగని రూమర్లు!

డిసెంబర్లో నయనతార పెళ్లి అని కొన్ని రూమర్లు, ఆల్రెడీ నయనతారకు పెళ్లి అయిపోయిందని మరి కొన్ని ఊహాగానాలు.. విఘ్నేష్ శివన్ తో ఆమె బంధం గురించి తమిళనాడు నుంచి వినిపిస్తున్న వార్తలు ఇవి. కొన్నాళ్లుగా ఈ ఊహాగానాలు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వాటికి చెక్ పెట్టడానికి నయనతార కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఆ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

తన పెళ్లి గురించి వచ్చిన ఊహాగానాలు అన్నీ బేస్ లెస్సే అని నయనతార ఈ మధ్యనే స్పష్టం చేసింది. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదని ఆమె తేల్చి చెప్పింది. ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన, పెళ్లి రెండూ ఉండవని ఆమె ప్రకటించింది. అయితే విఘ్నేష్ తో మాత్రం ఎంచక్కా విహరిస్తూ ఉంది.

అయితే తమిళ మీడియా మాత్రం అంతటితో వీరిని వదిలేయడం లేదు. పెళ్లి విషయంలో విఘ్నేష్ ఇంటి నుంచి ఒత్తిడి వస్తోందని, పెళ్లి చేసుకొమ్మంటూ వారు అతడికి గట్టిగా చెబుతున్నారంటూ తమిళ మీడియా కథనాలను ఇస్తోంది. దీంతో డిసెంబర్లో పెళ్లి ఉండవచ్చని అందులో పేర్కొంటోంది. నయనతార మాత్రం నెలకోసారి ఇలాంటి ఖండన ప్రకటనలు ఇవ్వాల్సి వస్తూ ఉండటం గమనార్హం!

Show comments