నందమూరీస్.. తెలివైన ప్రెస్ నోట్

నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి మొత్తానికి ఓ లాంఛనం పూర్తి చేసారు. తమ సోదరి సుహాసినికి 'విసెష్' చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆ ప్రెస్ నోట్ ను చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా డ్రాఫ్ చేసారు.

ఆ ప్రెస్ నోట్ ను అలా అలా పరికించితే చాలు, ఈ కూకట్ పల్లి వ్యవహారానికి నందమూరి సోదరులు ఎంత దూరమో అర్థం అయిపోతుంది. నిన్నటికి నిన్న సుహాసిని కూడా తన సోదరులు ప్రచారానికి వచ్చేదీ రానిదీ, తరువాత క్లారిటీ ఇస్తా అన్నారు కానీ వస్తారు అని చెప్పలేదు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మద్దతు వుందని, జనాలను మభ్య పెట్టడానికి తెలుగుదేశం అనుకూల మీడియా తెగ గ్యాసిప్ లు వండివారుస్తోంది.

సరే ప్రెస్ నోట్ వైనానికి వస్తే..

మొదటి వాక్యంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తమ తాతగారు ఎన్టీఆర్ స్థాపించారు. అది తమకు ఎంతొ పవిత్రమైనది. అంతేతప్ప, దాన్ని లాక్కునో, తీసుకునో, ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు ప్రస్తావన లేదు.

ఇక రెండో వాక్యం.
తమ తండ్రి హరికృష్ణ సేవలు అందించిన తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు సోదరి సుహాసిని పోటీ చేస్తున్నారు.

అంతేకానీ పార్టీ పోటీకి నిలిపినట్లు కాదు.

మూడో వాక్యం.
సమాజంలో మహిళలు కూడా ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం తమది.
(మరి లక్ష్మీ పార్వతి అలా పాత్ర పోషిస్తే అడ్డుకున్నది ఎవరో? అది హరికృష్ణ కుటుంబం కాదు కదా?)

ఇక అసలు సిసలైనది నాలుగో వాక్యం.
ప్రజాసేవకు సిద్దమవుతున్న సోదరి సుహాసినికి విజయం వరించాలి.

దట్సిట్. అంతే. సోదరికి ఓటేసి గెలిపించండి అని కానీ, ఆమె విజయానికి తమ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సహకరించాలి అని కానీ పొరపాటున పిలుపు ఇవ్వలేదు. జస్ట్ ఓ విసెష్ అందించారు. అంతే.

ఇప్పటికి నందమూరి సోదరులు చేసినపని తమ సోదరికి విజయం లభించాలి అని తెలియచేయడం తప్ప మరోటికాదు. పైగా ప్రెస్ నోట్ లో ఎక్కడా చంద్రబాబు, బాలయ్యల ప్రస్తావన లేదు. ఇవన్నీ చంధ్రబాబు ఇప్పుడు హరికృష్ణ ఫ్యామిలీని లేదా నందమూరి ఫ్యామిలీని విభజించు పాలించు అన్నట్లు ట్రీట్ చేస్తున్న ప్లానింగ్ ను చెప్పకనే చెబుతున్నాయి.

Show comments