'నంది' రాదని నాగ్ కు ముందే తెలుసా?

కారణాలేవైనా మనం సినిమాకు అన్యాయం జరిగింది. నంది అవార్డుల విషయంలో ఈ సినిమాను పట్టించుకోకపోవడం ఇటు సినీఅభిమానులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా కలత చెందారు. ఈ సినిమా కచ్చితంగా అవార్డుల పంట పండిస్తుందని అంతా ఊహించారు. కానీ అక్కడ ఉన్నది బాలయ్య. పైగా ఆయన నటించిన సినిమా లెజెండ్. ఇంకేముంది కీలకమైన అవార్డులన్నీ లెజెండ్ కే వెళ్లాయి.

అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తను ఎంతో ఇష్టపడి నటించి-నిర్మించిన మనం సినిమాకు అవార్డు రాదని నాగార్జునకు ముందే తెలుసట. అవార్డులు ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద నాగ్ ప్రస్తావించారట. మనం సినిమాకు పెద్దగా అవార్డులు ఊహించలేదని నాగ్ చెప్పుకొచ్చారట.

నాగ్ ఇలా మాట్లాడ్డానికి కారణం బాలయ్యతో ఉన్న విబేధాలే. నాగ్-బాలయ్య మధ్య అభిప్రాయబేధాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అవి ఇప్పటివి కావు, ఏఎన్నార్ కు గతంలో సన్మానం చేసినప్పుడు మొదలైన విభేదాలవి. అప్పట్నుంచి మొన్నటి నాగచైతన్య-సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. చైతూ-సమంత వెడ్డింగ్ రిసెప్షన్ కు బాలయ్య రాలేదు. నందమూరి కాంపౌండ్ నుంచి ఒక్క హరికృష్ణ మాత్రమే కనిపించారు. 

ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో బాలయ్య, నాగార్జునకు పడదనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణాల వల్ల జ్యూరీలో కీలక సభ్యుడిగా ఉన్న బాలయ్య, మనం సినిమాకు ప్రాధాన్యం ఇవ్వడని నాగార్జున ముందే ఊహించాడట.

అందుకే అవార్డుల విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకోలేదట నాగ్. ఉత్తమ ద్వితీయ చిత్రంగా 'మనం'ను ప్రకటించినప్పుడు 'ఓకే' అంటూ తనదైన స్టయిల్ లో ఓ నవ్వు పడేశాడట. కీలకమైన అవార్డులేవీ 'మనం'కు రాలేదన్నప్పుడు "కూల్.. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి" అంటూ సూచించాడట.

అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. బాలయ్య, నాగార్జున మధ్య గొడవలకు మనంకు ప్రాధాన్యం తగ్గడానికి సంబంధం లేదంటున్నారు ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్. ఆ గొడవలతో పార్టీకి, జ్యూరీకి ఎలాంటి సంబంధం లేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

కంభంపాటితో పాటు దాదాపు టీడీపీకి చెందిన చాలామంది నేతలు ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో ఇప్పటికే అందరికీ తెలిసిపోయాయి. మనంతో పాటు చాలా సినిమాలకు ఎలా అన్యాయం జరిగిందనే విషయం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు.

Show comments