జగనన్న సైన్యం కదిలింది...

జగనన్న.. ఏపీలో ఈ పదం మారుమోగుతోంది. జగన్ రాజ‌కీయమే సంచలనం అనుకుంటే ఆయన కోసం ప్రత్యేకంగా యువత ముందుకు వచ్చి అతి పెద్ద సైన్యంగా మారడం, జగన్ మేనియాలో వారు తన్మయత్వం చెందడం నిజంగా ఒక చరిత్రగానే చూడాలి.

జగన్ సీఎం కావాల్సిందే అని పట్టుబట్టి మరీ ప్రతీ గడపా తొక్కిన జగనన్న సైన్యం ఇపుడు జగన్ సంక్షేమ రాజ్యంలో ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ వస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పధకాలను అర్హులకు దక్కేలా చూస్తున్నారు.

ఇదిలా ఉంటే జగనన్న సైన్యం పేరిట ఒక లఘు చిత్రాన్ని విశాఖ జిల్లా నర్శీపట్నంలో లేటెస్ట్ గా చిత్రీకరించారు. ఈ లఘు చిత్రంలో జగన్ సంక్షేమ పధకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్నది పూర్తిగా చూపిస్తారు. అలాగే జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో సాధించిన విజయాలను కూడా వివరంగా తెలియచేస్తారు.

నర్శీపట్నం ఎన్టీయార్ స్టేడియం లో జగనన్న సైన్యం షూటింగ్ జరిగింది. నర్శీపట్నం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల జగన్ అభిమానులు, సైనికులు ఈ చిత్రం షూటింగ్ లో  ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 

ఈ షూటింగ్ మొత్తం సినీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ్ముడు, నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఆద్వర్యంలో సాగింది. జగన్ పుట్టిన రోజైన ఈ నెల 21న  ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి జగన్ కి కానుకగా ఇవ్వాలని నిర్వాహకులు ఆలోచన చేస్తున్నారు.

Show comments