మూడు పాటలు ఓకె అయ్యాక ఇదేంటీ..?

తమిళంలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా 96. ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు నిర్మాత దిల్ రాజు. శర్వానంద్-సమంత లీడ్ రోల్స్ లో నటించే ఈ సినిమా ఉగాదికి ప్రారంభమవుతుంది. తమిళం వెర్షన్ లో విజయానికి కీలకమైన ఫీల్ ను అస్సలు తగ్గకుండా, వీలయినంతగా యాజ్ ఇట్ ఈజ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఒకటి రెండు చిన్నచిన్న చేంజెస్ వుంటాయి. అంతకు మించి మార్పులు వుండవు.

ఇదిలా ఈ సినిమాకు సంబంధించి ఒరిజినల్ డైరక్టర్ ప్రేమ్ కుమార్, ఆయన టీమ్ నే తెలుగుకు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ ను తమిళ వెర్షన్ కు పనిచేసిన గోవింద్ వసంత్ నే పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు కొత్త ట్యూన్ లు ఈ సినిమా కోసం చేసారు. అలాగే తమిళ్ లో సూపర్ హిట్ అయిన కాదలే.. కాదలే ట్యూన్ ను తెలుగుకు యాజ్ ఇట్ ఈజ్ గా వాడుతున్నారు.

ఇలాంటి టైమ్ లో నిర్మాత దిల్ రాజు దర్శకుడు ప్రేమ్ కుమార్ సంగీత దర్శకుడి విషయంలో గొడవలు పడుతున్నారని ఒకరు గోవింద్ వసంతన్ కోసం, మరొకరు దేవీశ్రీప్రసాద్ కోసం పట్టుపడుతున్నారని గ్యాసిప్ లు రావడం విశేషం. మూడు పాటల ట్యూన్ లు అయిపోయాక ఇలా రావడం చూసి, యూనిట్ జనాలు నవ్వుకుంటున్నారు.

ఈ సినిమాను వీలయినంత మీడియం బడ్జెట్ లో తీయాలనుకుంటున్నారు దిల్ రాజు. సమంతకు కోటి రూపాయలు ఇస్తున్నారు. ఆ కోటి రూపాయలు ప్లస్ శర్వానంద్ రెమ్యూనిరేషన్ తో కలిపి 13 నుంచి 15 కోట్లలో సినిమాను ఫినిష్ చేయాలన్నది ప్లాన్ గావుంది.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!