మెగాస్టారా? పవర్ స్టారా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ లక్. అనుకోని ప్రమాదం జరిగింది. దాంతో సినిమా విడుదలకు ముందు ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రిలో వుండిపోవాల్సి వచ్చింది. 

ఐడలాజికల్ డైరక్టర్ దేవా కట్టాతో చేసిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్దమైంది. అనేకానేక కారణాల వల్ల విడుదల అనివార్యం. దాంతో అక్టోబర్ 1న విడుదలవుతోంది.

అయితే హీరో లేకుండా ఫంక్షన్ చేయచ్చు కానీ చీఫ్ గెస్ట్ లేకుండా కాదు. హీరో వున్నా కూడా చీఫ్ గెస్ట్ నే కీలకం. ఇప్పుడు మరీ కీలకం. మెగా హీరో తరపున, మరో మెగా హీరోనే బాధ్యతను భుజాన వేసుకోవాల్సి వుంది. అలా వేసుకుని ఫంక్షన్ ను నడిపేదెవరు?

మెగాస్టార్ నా? పవర్ స్టార్ నా? ఈ ఇద్దరిలో ఒకరు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ వస్తే ఆ స్పీచ్ వేరు. ఆ జోష్ వేరు. పవర్ స్టార్ వస్తే ఆ క్రేజ్ వేరు, ఆ క్రౌడ్ వేరు. మొత్తం మీద మేనల్లుడి కోసం ఇద్దరిలో ఒకరు నడుం బిగించి సినిమా ప్రమోషన్ ను భుజాన వేసుకోబోతున్నారు. 

Show comments