లగడపాటి.. ఇక చిలక జోస్యానికీ పనికిరాడా!

ఇప్పటికే రాజకీయం విషయంలో సన్యాసం తీసుకున్నాను అని ప్రకటించాడు. సన్యాసి సన్యాసిలా ఉండకుండా.. ఏదోలా సంసారం చేసేందుకు వచ్చాడు. మొదటికే మోసం తెచ్చుకున్నాడు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఒక ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఏ రోజుకు ఆ రోజు మ్యాచ్ విజేత ఎవరో చెబుతోందంటూ ఒక అక్టోపస్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసింది మీడియా. ఆ అక్టోసస్ దగ్గర రెండు బాల్స్ వేసి, ఆ బాల్స్ మీద ఆ రోజు తలపడబోయే జట్ల పేర్లు రాసేవాళ్లు.

వాటిల్లో అక్టోపస్ ఏ బంతి మీదకు వస్తే ఆ టీమ్ గెలుస్తుందనే ప్రచారం జరిగింది. సౌతాఫ్రికాలో ఆ సాకర్  ప్రపంచకప్ జరిగింది. ఆ ప్రపంచకప్ సమంయలో షకీరా వాకా వాకా సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో, ఆ ఆక్టోపస్ కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆ ఆక్టోపస్ కొంత కాలానికి చనిపోయింది. అది కూడా మీడియాలో ప్రముఖమైన వార్తగా వచ్చింది.

లగడపాటికి ఆంధ్రా అక్టోపస్ అంటూ తెలుగు మీడియా నామకరణం చేసింది. కమ్మవాళ్లు ఏ రంగంలో పని చేసినా వాళ్లను కీర్తించడానికి తెలుగులో మీడియా ఉంది. కమ్మ వాళ్లు ఏం చేసినా.. వాళ్లను ఫేమస్ చేయడానికి సహజ కవచాల్లా మీడియా వర్గాలు ఉంటాయి. లగడపాటి చెప్పే జోస్యాలు ఏదో గుడ్డోడు  గూట్లోకి రాయేసినట్టుగా నిజం అవుతూ ఉన్నా.. అతడిని ఆంధ్రా అక్టోపస్ అంటూ మీడియా కీర్తిస్తూ ఉంటుంది.

తటస్తుడిగా ఇమేజ్, ఆక్టోపస్ గా పేరు.. ఇంకేముంది లగడపాటిని తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోవడం రివాజు. ఈ సారి కూడా అదే గేమే ప్లే చేశారు. పోలింగ్ కు సమయం దగ్గర పడ్డాకా లగడపాటిని సీన్లోకి దించి.. అదిగో ఇండిపెండెంట్లు గెలిచేస్తున్నారంటూ మొదలుపెట్టించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదిమంది ఇండిపెండెంట్లు అంటూ మొదలుపెట్టారు.

ఇదంతా చంద్రబాబు నాయుడి గేమ్ అని, తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాల వ్యూహం అనేది స్పష్టం అవుతున్న విషయమే. ఆ మీడియా వర్గాలే కలిసి మాయ చేయ ప్రయత్నించాయి. శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడిని చంపే రాజకీయం అలాంటిది ఒకటి జరిగింది. అయితే ఇది పూర్తిగా అడ్డం తిరిగింది.

వీళ్లు ఏం ఆశించి పోలింగ్ తర్వాత కూడా లగడపాటిని తెరమీదకు తెచ్చారో కానీ.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి చెప్పిన జోస్యానికి, వాస్తవానికి ఇంచ్ కూడా పోలికలేకుండా పోయింది. దీంతో లగడపాటి ఆక్టోపస్ బిరుదు కూడా ఉత్తుత్తిదే అని తేలిపోయింది.

రాజకీయ సన్యాసం అని ప్రకటించిన లగడపాటి చిలక జోస్యాలు చెప్పడానికి కూడా పనికిరాడని ఇప్పుడు తేలిపోయింది. రేపటి ఏపీ ఎన్నికల ముందు మళ్లీ లగడపాటి ఇలాంటి చిలక జోస్యాలతో వచ్చి బాబును కాపాడేందుకు ప్రయత్నించినా.. జనాలు నవ్వుకుంటారని స్పష్టం అవుతోంది.

Show comments