హీరోయిన్ అంత నచ్చిందా?

పాప కాస్త లిబరల్ గా వుంటే గోకేసే జనాలకు టాలీవుడ్ లో అంత కరువేం వుండదు. ఎటొచ్చీ ఎవరి లిమిట్స్ లో వారు వుంటే సమస్య వుండదు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. అందులో ఓ హీరోయిన్ సౌత్ లాంగ్వేజ్ ల్లోంచి ఇక్కడకు పరిచయం అవుతోంది. ఈ సినిమా డైరక్టర్ కూడా పక్క భాషాచిత్రాల నుంచి ఇక్కడకు వచ్చినట్లే లెక్క. 

అయితే టాలీవుడ్ లో ఫుల్ గా వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, ఈ డైరక్టర్, సదరు హీరోయిన్ బాగా ఇంటిమసీతో వుంటున్నారన్నది. షూటింగ్ స్పాట్ లో సెట్ మీద కన్నా, పర్సనల్ ముచ్చట్లలోనే ఇద్దరు ఎక్కువ టైమ్ వుంటున్నారన్న గుసగుసలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 

ఆ గుసగుసలకు బలాన్ని ఇస్తున్నసంగతి ఇంకోటుంది. తెలుగుకు తొలిసారి పరిచయం అవుతున్న సదరు హీరోయిన్ డేట్ లు, సినమాల వ్యవహారాన్ని ఆ దర్శకుడే తన చేతిలోకి తీసేసుకున్నాడట. డైరక్టర్ లెవెల్ ఏంటీ? ఇలా కొత్త హీరోయిన్ డేట్లు వగైరా చూడ్డం ఏంటీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show comments