అరాచకానికి పరాకాష్ట.. స్పైడర్ సింగిల్ రిలీజ్

ఇప్పటివరకు ప్రతి హీరో చెప్పిన టైమ్ కే టీజర్ లేదా సాంగ్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అలా జరగని పక్షంలో అదే సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా చెప్పిన టైమ్ కు టీజర్ అందించలేకపోతున్నామని అఫీషియల్ గా అప్ డేట్ ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ స్పైడర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. జనాల సహనానికి పరీక్ష పెట్టారు. 

సరిగ్గా సాయంత్రం 6 గంటలకు స్పైడర్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. మహేష్ అభిమానులతో పాటు చాలామంది ఆ టైమ్ కు రెడీ అయ్యారు. అయితే స్పైడర్ సింగిల్ ను 6 గంటల 30 నిమిషాలకు విడుదల చేస్తామంటూ అంతలోనే మరో పోస్ట్. సరే ఏదో సాంకేతిక సమస్య వచ్చి ఉంటుందని సర్దుకున్నారు. తీరా టైమ్ దగ్గరకొచ్చేసరికి 7 గంటల 15 నిమిషాలన్నారు. ఇక అప్పట్నుంచి స్టార్టయింది జనాల్లో ఫ్రస్ట్రేషన్. సామాజిక మాధ్యమాల్లో తిట్ల దండకం అందుకున్నారు.

చివరికి ఆ టైమ్ కు కూడా యూట్యూబ్ లో సింగిల్ ప్రత్యక్షం కాలేదు. దీంతో ఫ్యాన్స్ లో ఓపిక నశించింది. జానాల్లో కోపం పెరిగింది. స్పైడర్ యూనిట్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఎప్పుడొస్తే అప్పుడు అని లైట్ తీసుకున్నారు. చివరికి జియో ప్రైమ్, సావన్ లాంటి వేదికలపై సింగిల్ ను రిలీజ్ చేసిన చాలాసేపటికి యూట్యూబ్ లో అప్ చేశారు. 

అలా సాయంత్రం 6 గంటలకు అనుకున్న సింగిల్ రిలీజ్, చాలా ఆలస్యంగా యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది. ఈ గ్యాప్ లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు స్పైడర్. ఇంతకుముందు ఏ సినిమా విషయంలో ఇంత సాగతీత, నాన్చుడు వ్యవహారం జరగలేదు.

Show comments