బరిలో మహేష్ కూడా పక్కా అంట

2018 సంక్రాంతి బరిలోకి మహేష్ సినిమా కూడా పక్కా అయిపోయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల సినిమా జనవరి 10న ఫిక్సయిపోయింది. 120కోట్ల సినిమా అది. బయ్యర్ల కోసం చాలా జాగ్రత్తగా డేట్ ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా విడుదలయ్యే రెండు రోజులకే మహేష్ సినిమా వచ్చేస్తోంది.

భరత్ అనే నేను సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత దర్శకులు డివివి దానయ్య, కొరటాల శివ ప్రకటించేసారు. అంటే బరిలో మహేష్ కూడా పక్కా అని తేలిపోయింది. మరోపక్క కెఎస్ రవికుమార్-బాలయ్య కాంబినేషన్ లో సినిమా కూడా చకచకా షూట్ జరుపుకుంటోంది. అది కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

ఎందుకంటే రవికుమార్ కూడా పూరి లాంటి డైరక్టరే. సినిమాను చకచకా ఫినిష్ చేయడంలో దిట్ట. ఇంకా దగ్గర దగ్గర అయిదు నెలల సమయం వుంది ఆయనకు. తెచ్చినా తెచ్చేస్తాడు బాలయ్య సినిమాను సంక్రాంతి బరిలోకి. అదే జరిగితే భలేగా వుంటుంది ఈ సారి సంక్రాంతి.

అన్నీ బాగానే వున్నాయి. మరి ఇంతకీ రామ్ చరణ్ రంగస్థలం పరిస్థితి ఏమిటో?

Show comments