బోయపాటి లైన్ లో ఆ ముగ్గురు

ముగ్గురు టాప్ హీరోలతో సినిమాలకు కథలు సిద్దం చేసారట దర్శకుడు బోయపాటి. పైగా ముగ్గురికి చేయాల్సిన సినిమాల బౌండ్ స్క్రిప్ట్ లు రెడీ అంట. అన్నింటికన్నా ముందుగా గీతా ఆర్ట్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి కోసం స్క్రిప్ట్ రెడీ చేసారట. మహేష్ బాబుకు లైన్ మాత్రం చెప్పారట. కథ నెరేషన ఇవ్వాలంట. ఇక బాలయ్య బాబుతో జూన్ నుంచి సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయివుందట. వీళ్లు ముగ్గురు కాకుండా అఖిల్ తో సినిమా చేయాల్సి వుందట. 

అఖిల్ తనకు మంచి స్నేహితుడని, అందువల్ల ఓ సినిమా చేయాలన్నది ఇద్దరికి కామన్ గా వున్న కోరిక అని, అయితే అది ఎప్పుడు వుంటుందన్నది క్లియర్ గా ఇప్పుడే చెప్పలేనంటున్నారు బోయపాటి. ముందుగా అనుకున్న ముగ్గురు హీరోల సినిమాలు మాత్రమే కాదని, ఇంకా చాలా ఆలోచనలు వున్నాయని, అయితే జయ జానకీ నాయక విడుదలయ్యాక, ప్రశాంతంగా కూర్చుని ఒక్కోటి సెట్ చేసుకోవాల్సి వుందని బోయపాటి చెప్పుకు వచ్చారు.

Show comments