టూ కంట్రీస్ సెంటిమెంట్

పరాయి భాషా చిత్రాలను తెలుగులోకి తెచ్చినపుడు మన నేటివిటీకి అనుగుణంగా టైటిళ్లు ఫిక్స్ చేస్తుంటారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఇంటర్ నెట్ వాడకం పెరిగిన పుణ్యమా అని ఇక్కడ రీమేక్ కాకుండానే అక్కడి టైటిల్ తోనే సినిమాలు మన జనాలకు బాగా పరిచయం అయిపోతున్నాయి. పైగా బాగా హిట్ అయిన సినిమాను కొంటే, జనాలు ఆ టైటిల్ తోనే ఈ సినిమాను గుర్తు వుంచుకుంటున్నారు. పైగా నిర్మాతలకు కూడా టైటిల్ సెంటిమెంట్ ఒకటి పుట్టుకొస్తోంది. దాంతో అదే టైటిల్ వుంచేస్తున్నారు.

ప్రేమమ్ సినిమా విషయంలో అలాగే జరిగింది. ఆ టైటిల్ బాగా పాపులర్. అందుకే అదే వుంచేరు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారట మరో నిర్మాత. మళయాలంలో హిట్ అయిన టూ కంట్రీస్ సినిమాను తెలుగులో సునీల్ తో రీమేక్ చేసారు నిర్మాత దర్శకుడు ఎన్ శంకర్. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయిపోయింది. జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మిగిలింది. టైటిల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం లాక్ పడిపోయింది. సరైన టైటిల్ ఏదీ ఈ సబ్జెక్ట్ కు సూట్ కావడంలేదు. 

తూర్పు పడమర అన్న టైటిల్ బాగా సూట్ అవుతుంది కానీ, ఓల్డ్ టైటిల్ అనుకుంటారేమో? అన్న చిన్న అనుమానం. ఆఖరికి టూ కంట్రీస్ అన్న టైటిల్ బాగానే పాపులర్ అయింది, పైగా హిట్ టైటిల్, అని అదే వుంచాలని ఫిక్సయ్యారట. అక్టోబర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారీ సినిమాను.

Readmore!
Show comments