ఇది అపూర్వ విజయం-కన్నబాబు

వైకాపా అధ్యక్షుడు జగన్ సాధించిన విజయం అపూర్వమని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని, అదే పార్టీ తరపున కాకినాడ రూరల్ నుంచి పోటీచేసి, తొలి నుంచీ ఆధిక్యంలో వుంటూ వస్తున్న కురసాల కన్నబాబు అన్నారు. ఆయన 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడుతూ ఇప్పటివరకు చరిత్రలో స్వంతంగా పార్టీ పెట్టి అధికారం సాధించిన వారు చాలా తక్కువ మంది అని, ఆంధ్రలో ఎన్టీఆర్ తరువాత ఆ ఫీట్ జగన్ కే సాధ్యమైందని అన్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం అన్నది జగన్ పై ప్రజలకు వున్న నమ్మకాన్ని తెలియచేస్తోందన్నారు. ఇంత అద్భుతమైన విక్టరీ సాధించడం అన్నది కేవలం జగన్ వల్లనే అయిందని ఆయన అన్నారు. జగన్ పట్టుదల, పోరాట స్ఫూర్తి, ఆయన పట్ల ప్రజల అభిమానం, భగవంతుడి దయవల్ల వైకాపాకు ఈ అద్భుత విజయం సాధ్యమైందని, ఈ అభిమానాన్ని పదికాలాల పాటు ఇలా కాపాడుకుంటామని కన్నబాబు అన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా

Show comments